రేణుకకు భవిష్యత్తు లేకుండా చేసిన రేపిస్ట్ చెన్న కేశవులు

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్‌ను దారుణంగా హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆమెను చంపిన వాళ్లను ఉరితీయాలంటూ ప్రజలు రోడ్డెక్కెలా చేసిందా ఘటన. కానీ, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారంతా ఎన్‌కౌంటర్ చేయబడ్డారు.

‘దిశ’ ఘటన ఆధారంగా సినిమా చేయబోతున్నట్లు సంచలన దర్శకుడు, కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన రాంగోపాల్ వర్మ శనివారం ప్రకటించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి కూడా తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం కలిశారు. రేపిస్ట్ చెన్న కేశవులు, అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని ఆర్జీవీ మండిపడ్డారు. రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిగా మార్చాడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయిందని ఆయన అన్నారు.

రేణుకను కలిసిన తర్వాత ఆర్జీవీ కింది విధంగా ట్వీట్ చేశారు. ‘రేపిస్టు చెన్న కేశవులు భార్య రేణుకను కలిశాను. ఆమె 16 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 17 ఏళ్ళకే ఆమె తన బిడ్డకు జన్మనివ్వబోతోంది. బాస్టర్డ్.. దిశను మాత్రమే కాదు.. తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు. ఆమెకు మరియు ఆమె జన్మనిచ్చే బిడ్డకు ఇద్దరికీ భవిష్యత్తు లేదు’ అని ట్వీట్ చేశారు.

For More News..

భార్య తల నరికి చేతిలో పట్టుకొని జాతీయగీతం

వీడియో: బావిలో పడిన కుక్కను ఓ మహిళ ఎలా కాపాడిందంటే..

ఢిల్లీ చేరిన రెండో కరోనా ఫ్లైట్

Latest Updates