వ‌ర్మ‌పై ప్ర‌ణ‌య్ తండ్రి కోర్టులో ఫిర్యాదు

నల్లగొండ జిల్లా: డైరెక్ట‌ర్ రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై.. ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశాడు. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ.. నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశాడు. స్పందించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని.. మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది.

Latest Updates