టీచర్ల బాధ్యతను గుర్తుచేసిన వర్మ

పండుగలు, ప్రత్యేక దినాల్లో తనదైన శైలిలో ట్వీట్లు చేసే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ టీచర్స్ డే నూ వదల్లేదు. గురువారం టీచర్స్ డే సందర్భంగా “ టీచర్స్ డేని ‘టీచర్స్ విస్కీ’తో టీచర్స్ సెలబ్రేట్ చేసుకుంటారా? జస్ట్ ఆస్కింగ్!’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

తన టీచర్స్ అంతా తనను ఒక మంచి విద్యార్ధిగా, ఓ మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యారని, కాబట్టి టీచర్స్ డే గురించి ఏం చెప్పాలో తనకు తెలియదంటూ ట్వీట్ చేశారు. తాను ఒకవేళ బ్యాడ్ స్టూడెంట్ అయినప్పటికీ.. ఓ మంచి విద్యార్ధిగా మార్చడం టీచర్ల బాధ్యత కాదా ? అంటూ ప్రశ్నించారు. ఎప్పుడైతే తనను ఓ మంచి విద్యార్థిగా మార్చడంలో టీచర్లు ఫెయిలయ్యారో అప్పుడే వారు బ్యాడ్ టీచర్లుగా నిరూపించబడ్డారంటూ సంచలన ట్వీట్లు చేశారు ఆర్జీవి.

 

Latest Updates