కాజల్‌ను అందుకే తక్కువగా చూపించాం

శర్వానంద్‌‌, కాజల్, కళ్యాణి ప్రధాన పాత్రల్లో ‘రణరంగం’ రూపొందించారు దర్శకుడు సుధీర్‌‌‌‌వర్మ. పంద్రాగస్ట్ న విడుదల కానున్న ఈ గ్యాంగ్‌‌స్టర్ డ్రామా గురించి సుధీర్ చెప్పిన విశేషాలు.

  •     ఇది పూర్తిగా స్క్రీన్‌‌ ప్లే బేస్డ్‌‌ సినిమా. కథ వర్తమానంలో మొదలై గతంలోకి వెళ్తుంది. ఎన్టీయార్ సమయంలో మద్యపాన నిషేధం విధించారు. ఆ సమయంలోనే దేవా ప్రయాణం మొదలవుతుంది. లిక్కర్‌‌‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో నడుస్తుంది. అతడు గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా ఎలా ఎదిగాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు వంటి వాటి చుట్టూ స్టోరీ తిరుగుతుంది.
  •     రణరంగం అంటే యుద్ధభూమి అని అర్థం. తన జీవితంలో వచ్చే సమస్యలపై హీరో ఎలా పోరాటం చేశారనేది సినిమా కనుక ఈ టైటిల్ యాప్ట్. నిజానికి మొదట దళపతి అని పెడదామనుకున్నాం కానీ అది వేరేవాళ్లు తీసుకున్నారని తెలిసి ఈ టైటిల్ ఫిక్స్ చేశాం.
  •     గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ మూవీ అనగానే ఎవరైనా ‘గాడ్‌‌ ఫాదర్’ చిత్రాన్నే ఫాలో అవుతారు. నేను కూడా దాని స్ఫూర్తితోనే కథనం రాసు
    కున్నాను. ఆ స్టైల్‌‌ని అడాప్ట్‌‌ చేసుకున్నాను. ఎంతవరకూ సక్సెస్ అయ్యాననేది సినిమా చూశాక తెలుస్తుంది.
  •     శర్వా సినిమాల్లో నాకు చాలా ఇష్టమైనది ‘ప్రస్థానం’. అందుకే తనతో సినిమా అంటూ చేస్తే ఇంటెన్సిటీ ఉండేదే తీయాలనుకున్నాను. శర్వానంద్‌‌ అచ్చు గుద్దినట్టు గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌లానే కనిపిస్తాడు. అంతగా ఇన్‌‌వాల్వ్ అయిపోయాడు. తన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. రెండింటినీ చాలా బాగా చూపించాడు.
  •     నిజానికి మొదట రవితేజతో అనుకున్నాను. ఓరోజు శర్వాతో వేరే స్టోరీ డిస్కస్ చేస్తూ అనుకోకుండా ఈ లైన్ చెప్పాను. ఆయనకి నచ్చి ఈ కథ చేయడానికి ఇంటరెస్ట్ చూపించారు. శర్వా దీనికి సూటవుతాడని నాకూ అనిపించడంతో రవితేజని కన్విన్స్ చేశా.
  •     రెండు కాలాలకు సంబంధించిన కథ కనుక చాలా చాలెంజింగ్‌‌గా అనిపించింది. అప్పుడు లేనివేమీ ఫ్రేమ్‌‌లోకి రాకుండా జాగ్రత్తపడాలి. అందుకే ప్రత్యేకంగా సెట్స్‌‌ వేసి తీయాల్సి వచ్చింది. బడ్జెట్‌‌ ఎంతయ్యిందనేది నిర్మాతలు నాకు చెప్పలేదు. ఎందుకంటే వాళ్లు క్వాలిటీని తప్ప ఖర్చుని పట్టించుకోరు.
  •                 ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. రీసెంట్‌‌గా శర్వానంద్ ఒక ఐడియా కూడా చెప్పారు. నాకు చాలా నచ్చింది. కానీ దీని రిజల్ట్ చూశాక దాని గురించి ఆలోచిస్తాను.
  • ట్రైలర్‌‌‌‌లో కాజల్‌‌ని ఎక్కువ చూపించలేదని ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నిజానికి ఆమె పాత్ర నిడివి తక్కువ. చిన్న పాత్రే అయినా చేయడానికి ఒప్పుకున్నందుకు తనకి థ్యాంక్స్ చెప్పాలి. కానీ తనని ట్రైలర్‌‌‌‌లో ఎక్కువ చూపిస్తే సినిమాలో కూడా ఎక్కువ ఎక్స్‌‌పెక్ట్ చేస్తారు. అందుకే ఎక్కువ చూపించలేదు. అంతే తప్ప ఆవిడను తక్కువ చేయాలని కాదు.

Latest Updates