హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కోటీ 80 లక్షల బంగారం పట్టివేత

దొంగబంగారాన్ని రవాణా చేస్తున్న ఇండిగో ఎయిర్ లెన్స్ అధికారిని పట్టుకున్నారు  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్ అధికారులు. ఈ ఘటన శనివారం రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం సదరు ఇండిగో ఎయిర్ లెన్స్ అధికారిని ఎగ్జిట్ గేట్ దగ్గర తనికీలు చేశారు. దీంతో అతని దగ్గర నుంచి 42ప్యాకెట్లలో చుట్టబడిన 42 విదేశీ బంగారం బిస్కెట్లు దొరికాయి.

అక్రమ బంగారం కలిగి ఉన్న ఇండిగో ఎయిర్ లెన్స్ అధికారిని ప్రశ్నించగా… శుక్రవారం దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని ఇచ్చారని చెప్పారు. వాళ్లు ఎమిరెట్ ఫ్లైట్ EK.528 ద్వారా వచ్చారని తెలిపారు. దీంతో ఆ ఇద్దరు ప్రయాణికులను కూడా పట్టుకుని విచారించారు. బంగారం దిగుమతికి చెందిన పత్రాలు లేకపోవడంతో వాళ్లను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ బంగారం 4891.200 గ్రాములు ఉందని.. దాని  విలువ రూ.1,84,88,736 అని చెప్పారు.

Latest Updates