ఈటల కాదు గంగుల కమలాకర్

బీఏసీ సమావేశానికి హాజరు
కావాలనే తప్పించారని టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ

హైదరాబాద్ , వెలుగు: అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) మీటింగ్ కు మంత్రి ఈటల రాజేందర్ ప్లేస్ లో మంత్రి గంగుల కమలాకర్ హాజరు కావడంపై టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా  జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కావాలనే ఈటలను మీటింగ్ నుంచి తప్పించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నుంచి ఈటల బదులుగా ఆయనే బీఏసీ సమావేశాలకు హాజరవుతారని సమాచారం.

Latest Updates