రోగాలకు జీవనశైలే కారణం

హైదరాబాద్‍, వెలుగు: ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు మానసిక, శారీరక రోగాలకు ప్రధాన కారణమని జిల్లా హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్‍ డాక్టర్‍ శ్రీకళ తెలిపారు. గురువారం హైదరాబాద్‍ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య దినోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శారీరకంగా, మానసికంగా మంచిగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం అంటారని అన్నారు.

ప్రస్తుత కాలంలో శారీరకంగా ఇబ్బందులు పెట్టే జబ్బులతో పాటు మానసిక సమస్యలు అధికంగా వస్తున్నాయన్నారు. సీనియర్‍ పబ్లిక్‍ హెల్త్ ఆఫీసర్‍ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, ఒంటరి తనం మానసిక జబ్బులకు మూలమని, బాధలను, ఆనందాలను అందరితో పంచుకోవడం ద్వారా మానసిక జబ్బులు దూరంగా పెట్టొచ్చన్నారు. సైకియాట్రిస్ట్ డాక్టర్‍ నివేదిత జిల్లా మాస్‍ మీడియా అధికారులు పాల్గొన్నారు.

Latest Updates