20 అడుగుల దూరంలో డెడ్‌బాడీలు.. ఎక్స్‌క్లూజివ్ వీడియో

శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార కేసులో పోలీసులు నిందితులని ఎన్ కౌంటర్ చేశారు. సరిగ్గా దిశ హత్యాచారం జరిగిన స్థలంలోనే నలుగురూ హతమయ్యారు. పోలీసులు  కేసును  సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌  చేస్తున్న  సమయంలో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పారిపోతున్న వారిపై పోలీసులు అక్కడికక్కడే  కాల్పులు జరపడంతో నిందితులు మహ్మద్‌ పాషా అలియాస్ ఆరిఫ్ , శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు.  ఒక్కొక్క మృతదేహం 20 అడుగుల దూరంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి

వారి శవాలకు చటాన్‌పల్లిలోనే పోస్టుమార్టం పూర్తయింది. స్థానిక ఆర్డీవో సమక్షంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుల తల్లిదండ్రులు వారిని చివరిసారి చూసేందుకు ఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు. మక్తల్ సీఐ శంకర్‌ బృందం వారిని సంఘటన స్థలికి తీసుకెళ్లింది. నారాయణపేట జిల్లా గుడిగండ్ల నుంచి మహ్మద్‌ పాషా తండ్రి హుస్సేన్‌, నవీన్‌ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవుల తండ్రి కురుమప్ప సంఘటన స్థలికి బయల్దేరి వెళ్లారు.

Latest Updates