మహబూబ్‌నగర్ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు

దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్‌ను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. నాలుగు మృతదేహాలు ఒక్కొక్కటి 20 నుంచి 30 అడుగుల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో వారి మృతదేహాలకు స్పాట్‌లోనే పోస్టుమార్టం నిర్వహించాలని భావించారు. అందుకోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి అయిదుగురు డాక్టర్ల బృందం బయలుదేరింది. అక్కడే కాకుండా మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కుందూరు, నందిగామ, చౌదరిగూడ, ఫరూక్ నగర్‌లకు చెందిన నలుగురు తహసీల్దార్లకు పోస్టుమార్టం బాధ్యతలను అప్పగించారు. వారి అధ్వర్యంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

For More News..

Latest Updates