సజ్జనార్ ఆధ్వర్యంలో అప్పుడు వరంగల్‌లో అలా.. ఇప్పుడు హైదరాబాద్‌‌లో ఇలా..

దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్‌ను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా.. నిందితులను కస్టడీకి ఇచ్చిన మరుసటి రోజే ఎన్‌కౌంటర్ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ఎన్‌కౌంటర్ బృందానికి సీపీ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన వరంగల్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా యాసిడ్ దాడి నిందితులు ఇలాగే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. వరంగల్‌లో యాసిడ్ దాడి చేసిన నిందితులను కూడా కస్టడీలోకి తీసుకున్న కొద్ది రోజుల్లోనే డిసెంబర్ 13, 2008న ఎన్‌కౌంటర్ చేశారు. ఇప్పుడు దిశ కేసులో నిందితులను కూడా కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజే, అది కూడా డిసెంబర్ నెల కావడంతో ఈ ఘటన అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.

For more news..

Latest Updates