ఒక్కో కుటుంబానికి 50 లక్షలు ఇప్పించండి: దిశ నిందితుల కుటుంబసభ్యులు

సుప్రీంలో దిశ నిందితుల కుటుంబాల పిటిషన్
పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వినతి
ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపారని ఫిర్యాదు

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కస్టడీలో ఉన్న నిందితులను హత్య చేసినందుకుగానూ ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇప్పించాలని పిటిషన్ వేశాయి. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో నిందితుల తల్లిదండ్రుల తరఫున అడ్వకేట్లు ఆర్. సతీశ్, పీవీ కృష్ణమూర్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చి చంపి , ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, పోలీసులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని నిందితులు ఆరిఫ్ తండ్రి పింజరి హుస్సేన్, జొల్లు నవీన్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రాజయ్య, చెన్నకేశవులు తండ్రి కుర్మన్న సుప్రీంను కోరారు. అనంతరం పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు ఆర్. సతీశ్, పీవీ కృష్ణ మూర్తి మీడియాతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఫేక్ ఎన్‌కౌంటర్ చేసినందుకు కుటుంబాలకు రూ. 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కుటుంబాలు కోరుతున్నాయని చెప్పారు.

For More News..

లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి

Latest Updates