ఘటనా స్థలానికి నేడు దిశ నిందితులు!

దిశ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసును సత్వరమే తేల్చాలని సిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. నలుగురు నిందితులకు డాక్టర్ల చేత పోలీసులు వైద్య పరీక్షలు చేయించనున్నారు. పోలీసులు ఇప్పటికే సీన్ రీకనస్ట్రక్షన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులకు లారీలో పలు ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఈ కేసులో దిశ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా విచారణను గోప్యంగా రహస్య ప్రదేశంలో జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహిళా కమిషన్, పోలీసులు, ప్రభుత్వాల దృష్టంతా దిశ కేసుపైనే ఉంది. ప్రజలు ఈ కేసుపై తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో దర్యాప్తు తొందరగా పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకే నిందితులను వారం పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అందుకు అంగీకరించిన కోర్టు, నిందితులను పోలీసుల కస్టడీకి ఇచ్చింది.

More News

ఫోన్ నంబర్ చెప్పి.. ఫొటో దిగితేనే బాటిల్లో పెట్రోల్
డాక్టర్ “దిశ” పై అభ్యంతరకర పోస్ట్ లు : స్మైలీ నాని అరెస్ట్

నిందితులను విచారించే బృందానికి శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన నలుగురు అడిషినల్ ఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల బృందం ఏర్పాటయ్యింది. దిశ ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆమెను పెట్రోల్ పోసి కాల్చిన సమయం వరకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే దానిపై ఈ బృందం దర్యాప్తు చేయనుంది. ఈ విధంగా మొత్త సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. వారం రోజుల కస్టడీలో నిందితుల దగ్గర నుండి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. అత్యాచారం, హత్య జరిగిన స్థలానికి నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకనస్ట్రక్షన్ చేయనున్నారు. సీన్ టూ సీన్ మొత్తం నిందితుల దగ్గర నుంచి వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. దిశ మొబైల్ ఏం చేశారు? దిశను ఏ విధంగా ట్రాప్ చేశారు? అత్యాచారం చేసే ముందు మద్యం సేవించారా? ఎందుకు హత్య చేశారు?  అనే విషయాలపై పోలీసులు మరోసారి ఆరా తీయనున్నారు.

అయితే కస్టడీ పూర్తయిన మరుక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పోలీసులు.. కస్టడీలో నిందితులు ఇచ్చే సమాచారాన్ని కూడా చార్జిషీట్లో పొందుపరచాలని పోలీసులు భావిస్తున్నారు.

Latest Updates