నా కొడుకే కాదు..దేశంలో హత్యాచార నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయాలి: ఏ2 నిందితుడు జొల్లి శివ తండ్రి

దేశంలో హత్యచార కేసులో శిక్షను అనుభవిస్తున్న నిందితులందర్ని ఉరితీయాలని ఏ2 నిందితుడు జొల్లి శివ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై నిందితుడు జొల్లి శివ తండ్రి మీడియాతో మాట్లాడాడు.

వెటర్నరీ డాక్టర్ హత్యకేసులో తన కుమారుడికి ఉరిశిక్ష వేస్తారని ప్రచారం జరిగిందన్నారు. అయితే తన కుమారుడితో పాటు మిగిలిన ముగ్గురిని ఏ విధంగా ఎన్ కౌంటర్ చేశారో…దేశంలో హత్యచార కేసు నిందితుల్ని అలాగే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్ కౌంటర్ విషయంలో తన కుమారుడి గురించి మాట్లాడేది ఏం లేదని, దిశ కేసులో తప్పు చేశారన్నారు. కానీ దేశ వ్యాప్తంగా రేప్ అటెంప్ లు జరిగాయని, మరి వాటిలో నిందితుల్ని ఇంతవరకు ఎందుకు శిక్షించలేదని శివ తండ్రి ప్రశ్నించారు.

Latest Updates