మాకు పరిహారం ఇవ్వాలి: దిశ నిందితుల కుటుంబ సభ్యులు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సీబీఐ తో విచారణ చేయించాలని విచారణకు కమిషన్ కు చెప్పారు నిందితుల కుటుంబసభ్యులు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితుల తల్లిదండ్రులు..  గురువారం హైకోర్టులో విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. బూటకపు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబాలన్ని చనిపోయిన పిల్లలపైనే ఆధారపడి ఉన్నాయని.. తమకు పరిహారం ఇప్పించాలని కమిషన్ ను కోరారు. పోలీసులు తమను భయపెట్టి సంతకాలు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

Latest Updates