దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ..

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లాయర్ల GS మణి, ML శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది. నలుగురు నిందితులను ఫేక్ ఎన్ కౌంటర్ చేశారని.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై FIR దాఖలు చేయాలని జీఎస్ మణి కోర్టును కోరారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై CBI లేదా CID లేదా స్వతంత్ర సంస్థలచే దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరారు. మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు రాకుండా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు లాయర్ ML శర్మ. అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  దర్యాప్తు జరుగుతోందని ఛీప్ జెస్టిస్ తెలిపారు. మీడియాకు వాక్ స్వేచ్ఛ ఉందన్నారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

Latest Updates