హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్

దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు హైకోర్టుకు చేరింది.  సోమవారం ఎయిమ్స్‌ వైద్యుల బృందం  నిందితుల డెడ్ బాడీలకు గాంధీ మార్చురీలో రీపోస్టుమార్టం నిర్వహించింది. ఆరుగంటల పాటు సాగిన ఈ పోస్టుమార్టంను వీడియో తీశారు అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియో సీడీలను ఎయిమ్స్ బృందం కోర్టుకు ఇచ్చింది. తాము ఢిల్లీ వెళ్లాక పూర్తిస్థాయి రిపోర్టును అందజేస్తామని  డాక్టర్ల బృందం తెలిపింది.

ఢిల్లీ ఎయిమ్స్‌  డాక్టర్లు సుధీర్‌గుప్తా, ఆదర్శ్‌కుమార్‌, అభిషేక్‌యాదవ్‌, వరుణ్‌ చంద్ర లు నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించారు.

Latest Updates