దిశ కేసు: ఎవరి శరీరంలో ఎన్ని బుల్లెట్లు?

దిశ నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకువెళితే వారు అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఎన్ని బుల్లెట్లు వాడారు? ఎవరి శరీరంలో ఎన్ని బల్లెట్లు దిగాయి? అన్నది అంతుచిక్కకుండా ఉంది.

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ పోస్టుమార్టం నివేదికలో ఎవరి శరీరంలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో బయటపడింది. మహ్మద్ ఆరిఫ్ శరీరం నుంచి నాలుగు బుల్లెట్లు, చెన్నకేశవులు శరీరం నుంచి రెండు బుల్లెట్లు లభించినట్లు సమాచారం. మరో ఇద్దరు నిందితులైన జొల్లు శివ, నవీన్‌ల శరీరాల నుంచి చెరో బుల్లెట్ లభించాయి. నిందితుల శరీరం నుంచి మరియు సంఘటన స్థలంలో మొత్తం కలిపి 12 బుల్లెట్లు పోలీసులకు లభించాయి.

Latest Updates