చట్టాలు ఉన్నా.. ఆచరణలో లేవు: అత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ తండ్రి

చట్టాలు ఉన్నా ఆచరలో లేవని అన్నారు హైదరాబాద్ లో అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ తండ్రి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన భారత న్యాయ వ్యవస్థలో రేప్ చేసిన వారిని శిక్షించేలా ఎన్నో చట్టాలు ఉన్నాయని… అయితే వాటి అమలు జరగడానికి చాలా కాలం పడుతుందని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా.. నిర్భయ కేసులో నింధితులకు ఇప్పటివరకు శిక్ష పడలేదని చెప్పారు. ఇటువంటి వారికి తక్షనమే శిక్షపడేలా చూడాలని కోరారు. అప్పుడే మరో తప్పు జరగకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Updates