డీ ఈ మేకప్​ లుక్​తో మెస్మరైజ్ చేస్తున్న దిశా పటానీ

మొన్న దీపికా పదుకొనే.. నిన్న కరీనా, ఆలియా.. ఈరోజు దిశా పటానీ. అందరి నోట ఒక్కటే మాట అదే డీ ఈ మేకప్​. గ్లోయింగ్ అండ్ షైనింగ్​ స్కిన్​ కోసం చాలామంది సెలబ్రిటీలు ఈ మేకప్​ లుక్​నే ఫాలో అవుతున్నారిప్పుడు. రీసెంట్​గా బాలీవుడ్ ​ బ్యూటీ  దిశా పటానీ డీ ఈ మేకప్​ లుక్​తో అందర్నీ మెస్మరైజ్​ చేసింది. రెగ్యులర్​గా యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​లో మేకప్​ ట్యుటోరియల్స్​ చెప్తుంటోంది దిశా. అలా ఈ మధ్య డీ ఈ  మేకప్​ గురించి మాట్లాడింది. డీ ఈ మేకప్​ లుక్​ని పోస్ట్​ చేసి ఎంతమందికి ఈ మేకప్​ ట్యుటోరియల్​ కావాలనిపిస్తోంది అంటూ ఇన్​స్టాలో పోల్ కండక్ట్​ చేసింది. దాంతో అందరి దృష్టి దిశా మేకప్​పై పడింది. షైనింగ్ స్కిన్​తో మెరిసిపోతున్న దిశాని చూసి ఈ మేకప్​ గురించి సెర్చింగ్​ మొదలుపెట్టారు అంతా. ఇంత క్రేజ్​ ఉన్న ఈ మేకప్​ ఎలా వేసుకోవాలంటే..

ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేయాలి. టోనర్​ సీరమ్​లో దూది ​ ముంచి ముఖం, మెడ, ఛాతి భాగాల్ని తుడవాలి. డీ ఈ  మేకప్​ లుక్​కి  సీరమ్​ టోనర్స్​ పర్ఫెక్ట్​ ఆప్షన్​. ఈ లుక్​ ట్రై చేసేవాళ్లు మామూలు టోనర్స్​ జోలికి వెళ్లొద్దు. రెండు చుక్కలు కూలింగ్ ఐ–జెల్​ని కళ్ల కింద రాయాలి. తర్వాత  డ్రై స్కిన్​ వాళ్లు ఎస్​పిఎఫ్​ ఉన్న మాయిశ్చరైజర్​ని, ఆయిలీ స్కిన్​ వాళ్లు మ్యాటీ ప్రైమర్​ని ముఖానికి రాయాలి. తర్వాత ఫేస్​ మిస్ట్​ని ముఖంపై జల్లి  కాసేపు ఆరనివ్వాలి. డీ ఈ  మేకప్​ లుక్​కి సిలికాన్​ బేస్డ్​ ప్రైమర్స్​ వాడొద్దు.

తర్వాత లైట్​ కలర్​ ఫౌండేషన్ లేదా బీబీ క్రీమ్​ని ముఖానికి రాసి  చేతివేళ్లతో నెమ్మదిగా తట్టాలి.  షైనింగ్ లుక్​ కోసం మామూలు పౌడర్స్​కి బదులు క్రీమీ బ్రష్​లని ఎంచుకోవాలి. లిక్విడ్​ హైలైటర్స్​ని  గడ్డం, చీక్​, ఐ– బోన్స్,  పై పెదవి పై భాగంలో  అప్లై చేయాలి.  ఐ– ఇన్నర్​ కార్నర్స్​, ఐ బ్రో బోన్స్​పైనా  లిక్విడ్​ హైలైటర్స్​ని రాయాలి. మేకప్​ పూర్తయ్యాక బ్రోజర్స్​​ని కనురెప్పల మీద బ్రష్​తో అప్లై చేయాలి. ​బ్రౌన్​ మస్కారా మాత్రమే ఎంచుకోవాలి.

Latest Updates