ముగిసిన దిశ నిందితుల అంత్యక్రియలు

దిశ నిందితుల అంత్యక్రియలు ముగిసాయి. ఎన్ కౌంటర్ జరిగిన 17 రోజుల తర్వాత.. మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో మృతదేహాలను పూడ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిగండ్లలో.. చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ ల అంత్యక్రియలు నిర్వహించారు. జక్లేర్ లో మహ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలు జరిపారు.

అంతకు ముందు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎయిమ్స్ డాక్టర్ల టీమ్… మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేసింది. తర్వాత ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు నిందితుల మృతదేహాలను తరలించారు. నిందితుల మృతదేహాల రాక సందర్భంగా.. గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రాత్రి వరకు అంత్యక్రియలు పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలతో.. టైట్ సెక్యూరిటీ మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

Latest Updates