కాంగ్రెస్ పార్టీలో ‘రాజీనామా’ ప్రకంపనలు

  • లేఖలు పంపిన పలువురు పీసీసీ చీఫ్ లు
  • అధ్యక్షుడి సూచన మేరకే తప్పుకుంటున్నామన్న నేతలు
  • తన రాజీనామాపైనా వెనక్కితగ్గని రాహుల్

న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రకంపనలు రెట్టిం పయ్యాయి. ఓటమికి కారణమైన వాళ్లంతా బాధ్యత వహించాల్సిందేనంటూ సీడబ్ల్యూ సీ మీటింగ్ లో అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుపట్టా రన్న వార్తల నేపథ్యంలో పార్టీ ముఖ్యులు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పంజాబ్,జార్ఖండ్ , అస్సాం పీసీసీ చీఫ్ లైన సునీల్ జక్కర్ ,అజయ్ కుమార్ , రిపున్ బోరా సోమవారం తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, సీడబ్ల్యూసీ మీటింగ్ కు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ వాస్తవాలు కావని, నిర్ణయాత్మక మండలిగా సీడబ్ల్యూసీ పవిత్రతను గౌరవించాలని కోరుతూ కాంగ్రెస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే , రాజీనామాల పరంపరం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ , కర్ణాటకలపై ప్రభావం చూపింది.

వెనక్కి తగ్గని రాహుల్ !

ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో 52 సీట్లకే పరిమిత-మైన కాంగ్రెస్ , 18 రాష్ట్రాలు, యూటీల్లో ఖాతా తెరవలేదు. పార్టీ పరాజయానికి బాధ్యతగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని శనివారం నాటి సీడబ్ల్యూ సీ భేటీలో ప్రకటించిన రాహుల్ , ఇప్పటికీ అదేమాటపై ఉన్నారని, రెండ్రోజులుగా సీనియర్లు బుజ్జగిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదనితెలిసింది. సోమవారం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా శాంతి స్థల్ లో నివాళులు అర్పించడానికి వచ్చిన సమయంలోనూ రాహుల్ కు నచ్చజెప్పేందుకు కొందరు నేతలు ప్రయత్నిం చగా, ఆయన మాత్రం నవ్వుతూ వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయారు.

సీడబ్ల్యూ సీపై పుకార్లు నమ్మొద్దు

సీడబ్ల్యూ సీ సమావేశంలో పార్టీ సీనియర్లు, రాజస్థాన్ , మధ్యప్రదేశ్ సీఎంలైన అశోక్ గెహ్లాట్ , కమల్ నాథ్​, మాజీ మంత్రి చిదంబరంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారని, కొడుకులకు టికెట్లిప్పించుకున్న ఆ ముగ్గురూ మిగతా చోట్ల  ప్రచారానికి వెళ్లకపోవడాన్ని పార్టీ చీఫ్ తప్పుపట్టారనీ వార్తలువచ్చాయి. అయితే, అలాంటి వార్తల్ని నమ్మొద్దంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘‘కాంగ్రెస్ కు సంబంధించి సీడబ్ల్యూ సీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి. దాని పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిది. భేటీలో ఏం జరిగిందో ఆరోజే మీడియాకు వివరించాం. అయినా కూడా ఆ సమావేశం చుట్టూ కట్టుకథలు, పుకార్లు సృష్టిస్తున్నారు. పై మీడియాలో, బయట ప్రచారంలో ఉన్నవన్నీ అవాస్తవాలు, పుకార్లు మాత్రమే”అని ప్రకటనలో  పేర్కొన్నారు.

గెహ్లాట్ కు చేదు అనుభవం?

రాహు ల్ ని బుజ్జగించేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు తెలిసింది. సోమవారం తనను కలవడానికి వచ్చిన గెహ్లాట్ కు రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, చెప్పాల్సిం దేమైనా ఉంటే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కలవాలని సూచించినట్లు సమాచారం. దీంతో గెహ్లాట్  వేణుగోపాల్ ను , ఆతర్వాత అహ్మద్​ పటేల్ ను కలిసి వెళ్లిపోయారని పార్టీ వర్గా లు పేర్కొన్నాయి. అటు రాజస్థాన్ లోమంత్రి లాల్ చంద్​ కఠారియా రాజీనామా చేశారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో తప్పుల వల్లే ఓడిపోయామని మరోమంత్రి ఉదయ్ లాల్ అంజాన అన్నారు.

కమల్ సర్కార్ నిలబడదు: బీజేపీ

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలోఉందని, తిరిగి బలం నిరూపించుకునేలా ఆదేశాలివ్వాలంటూ బీజేపీ గవర్నర్ ను కోరిన దరిమిలా ఆదివారం నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం హస్తం పార్టీలో ఆత్మవిశ్వాసం నింపింది. అయితే భేటీకి హాజరైన ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీఎం, మంత్రులపై నమ్మకం లేదని, అపనమ్మకమే పునాదిగా నడుస్తు న్న కమల్ నాథ్ సర్కారు.. బీజేపీ ప్రమేయం లేకుండా దానంతటదే కూలిపోతుందని బీజేపీ సీనియర్ నేత విశ్వాస్ సారంగ్ అన్నారు.

బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యేలు

దీదీకి మరో ఝలక్

కోల్ కతా: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత వెస్ట్​బెంగాల్ పై మరింత ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఫిరాయింపుల్ని ముమ్మరం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్ని సోమవారం ఢిల్లీకి తరలించింది.బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్.. దగ్గరుండి మరీ వాళ్లను విమానంలో తీసుకెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు ముకుల్ రాయ్ కొడుకు శుభ్రాన్షూ కాగా, మిగతా ఇద్దరి పేర్లు సిల్ భద్రదత్ , సునీల్ సింగ్. ఈ ముగ్గురూ మంగళవా రం అధికారికంగా బీజేపీలో చేరనున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు కోల్పోయినందుకు బాధ్యతగా రాజీనామా చేస్తానన్న మమతా బెనర్జీ ప్రకటనపై ముకుల్రాయ్ మండిపడ్డా రు. ‘‘మీడియాలో హెడ్ లైన్ల కోసమే తప్ప నిజంగా మమత రాజీనామా చేయరు. అయినా రిజైన్ లెటర్ ఎవరికిస్తారు?తనకు తానే లెటర్ రాసుకొని, మళ్లీ తానే రిజెక్ట్​ చేస్తారు. ఇదంతా ఓ డ్రామా” అని ముకుల్ రాయ్ వ్యాఖ్యానించా రు.

 

 

 

 

Latest Updates