సీతక్కకు విశిష్ట సేవా పురస్కార్

ములుగు, వెలుగు: లాక్డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న పేదలకు నిత్యం అందుబాటులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క విశిష్ట సేవా పురస్కార్ కు ఎంపికయ్యారు. మంగళవారం శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ప్రతినిధులు ములుగుకు వచ్చి సీతక్కను కలిసి ఎంపిక పత్రాన్ని అందజేశారు. 15 ఏళ్లుగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ అమరేష్ పేర్కొన్నారు.

ఏజెన్సీ గ్రామాల్లో నిత్యావసర సరుకులు అందజేస్తూ కరోనాపై అవగాహన కల్పించడంలో సీతక్క కీలక పాత్ర పోషిస్తోందన్నా రు. లాక్ డౌన్ పూర్తయిన తరువాత గవర్నర్ తమిళిసై చేతులమీదుగా అవార్డును అందిస్తామని ఆయన
చెప్పారు.

Latest Updates