కరోనా వైరస్ రాకుండా ఉచిత హోమియో మందుల పంపిణీ

కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు బీజేపీ మెడికల్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందులు పంపిణీ చేస్తున్నామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, కరోనాపై ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపొతున్నారని అన్నారు.

ఉన్న ఆసుపత్రుల లకే దిక్కులేదు గానీ సీఎం కేసీఆర్ మాత్రం ‘హైదరాబాద్ కు చుట్టూ పక్కల ఆసుపత్రుల కట్టిస్తా’ అంటున్నాడని మండిపడ్డారు లక్ష్మణ్. బీజేపీ వైద్య బృందానికి ఉన్న సోయి కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదని, బీజేపీ నేతృత్వంలోని డాక్టర్స్ టీమ్ 35 లక్షల మెడిసిన్ సేకరించిందని, వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అవినీతి మయం అయిందని, ఇటీవల ఓ డాక్టర్ చేస్తున్న అవినీతి ఆరోపణలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.

 

Latest Updates