నేటి నుంచే బియ్యం, రేప‌టి నుంచి డ‌బ్బులు

రాష్ట్రంలో రేషన్ ల‌బ్ధిదారుల ఫ్యామిలీల‌కు నేటి నుంచి ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు. రేప‌టి నుంచి రూ.1,500 జ‌మ కానున్నాయి. కార్మికుల దినోత్స‌వం (మే.. డే) సంద‌ర్భంగా ఇవాళ‌ బ్యాంకుల‌కు సెలవు కావ‌డంతో రేపు న‌గ‌దు జ‌మ చేయ‌నున్నారు. అలాగే నిజామాబాద్, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్ రూర‌ల్, మెద‌క్ లో కుటుంబానికి కిలో కందిప‌ప్పు ఇస్తామ‌ని పౌర‌స‌ర‌ఫరాల ఖాఖ తెలిపింది.

ఈ నెల 15 త‌ర్వాత మిగ‌తా 29 జిల్లాల్లో ‌‌పంపిణీ చేస్తామ‌ని చెప్పింది. రేష‌న్ షాపులు ప్ర‌తి నెలా 23వ తేదీ వ‌ర‌కు ప‌ని చేస్తాయ‌ని తెలిపింది. అలాగే రేష‌న్ తీసుకునేట‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని సూచించింది రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌.

Latest Updates