పోలీసు జీపుల్లో TRS డబ్బు పంపిణీ : రఘునందనరావు

దుబ్బాక ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్‌ఎస్‌ నేతలు పోలీస్‌ వాహనాల్లో డబ్బులు పంచేందుకు ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు. దుబ్బాక ఉపఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నాయకులు ప్రచార జోరును పెంచారు. అంతేకాదు ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ..ఎరికి వారే గెలుపు దీమా వ్యక్తం చేస్తున్నారు.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు భూంపల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి ఇవాళ(శుక్రవారం) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఎమ్మెల్యేను చేస్తే.. భూంపల్లిని మండల కేంద్రంగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలా చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు పోలీసోళ్ల  వెహికిల్స్ లో డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. నేడో…రేపో డబ్బులు పంచే ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకొని బీజేపీ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు రఘనందన్ రావు.

Latest Updates