వారి సంపాదన పంచితే మనిషికి రూ. 94 వేలు వస్తాయి

  • మహా కోటీశ్వరుల ‘కరోనా టైమ్​’ సంపద పేదలకు పంచితే తలో 94 వేలు
  • గత 100 ఏళ్లలో కరోనా క్రైసిసే అతిపెద్దది
  • ఆక్స్‌‌ఫామ్‌‌ రిపోర్ట్‌‌ వెల్లడి
  • టాప్ 100 మంది సంపన్నుల కరోనా కాలం సంపద రూ. 12,97,822 కోట్లు
  • 13 కోట్ల 80 లక్షలమందికి పంచితే ఒక్కొక్కరికి వచ్చేది రూ. 94,045

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి టైములో దేశంలోని టాప్​ 100 మంది సంపన్నుల​ సంపద రూ. 12,97,822 కోట్లు పెరిగింది. గత ఏడాది మార్చి నుంచే ఈ సంపద వారి చేతికి వచ్చింది. దేశంలోని 13.8 కోట్ల మంది పేదలకు పై సంపదను పంచి పెడితే ఒక్కొక్కరికీ రూ. 94,045 చొప్పున సరిపోతుంది. ది ఇనీక్వాలిటీ వైరస్​ పేరుతో రిలీజ్​ చేసిన రిపోర్టులో ఆక్స్​ఫామ్​ ఈ వివరాలు వెల్లడించింది. గత వందేళ్లలో కరోనా వైరసే వరస్ట్​ క్రైసిస్​గా ఈ రిపోర్టులో ఆక్స్​ఫామ్​ పేర్కొంది. 1930లలోని గ్రేట్​ డిప్రెషన్​ను తలపించే విధమైన సంక్షోభాన్ని కరోనా వైరస్​ గ్లోబల్​గా సృష్టించిందని తెలిపింది. కరోనా వైరస్​ వల్ల పూర్, రిచ్​ పీపుల్​ మధ్య గ్యాప్​ మరింత పెరుగుతుందని 79 దేశాలలోని 295 మంది ఎకానమిస్టులు తమ సర్వేలో అభిప్రాయపడినట్లు కూడా ఆక్స్​ఫామ్​ వెల్లడించింది. జెఫ్రీ శాచ్స్​, జయతి ఘోష్​, గాబ్రియెల్​ జుక్​మాన్​లు సర్వేలో పాల్గొన్న ఎకానమిస్టులలో ఉన్నట్లు పేర్కొంది.

లాక్‌‌డౌన్‌‌తో గంటకు 1.7 లక్షల ఉద్యోగాలు పోయాయ్‌‌..

కరోనాతో దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో ఏప్రిల్​ 2020లో ప్రతీ గంటకూ 1,70,000 మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నట్లు కూడా ఆక్స్​ఫామ్​ రిపోర్టు వెల్లడించింది. కరోనా టైములో ముకేశ్​ అంబానీ సంపాదనతో 40 కోట్ల మంది పేద వర్కర్లను అయిదు నెలలపాటు పావెర్టీ లైన్​కు పైన అట్టే పెట్టొచ్చని తెలిపింది. దేశంలోని బిలినియర్ల సంపద లాక్​డౌన్​ టైములో 35 శాతం, 2009 నుంచీ చూస్తే 90 శాతం పెరిగి 422.9 బిలియన్​ డాలర్లకు చేరినట్లు పేర్కొంది. ఈ కారణంగానే అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్​ల తర్వాత ఆరో ప్లేస్​లో నిలిచిందని తెలిపింది. దేశంలోని టాప్​ 11 బిలినియర్ల కరోనా టైము సంపాదనతో రూరల్​ ఎంప్లాయ్​మెంట్​ కోసం తెచ్చిన  ఎంజీఎన్​ఆర్​ఈజీఏ స్కీమును పదేళ్లపాటు నడిపించొచ్చని, లేదా హెల్త్​ మినిస్ట్రీని పదేళ్లపాటు నడపొచ్చని ఆక్స్​ఫామ్​ రిపోర్టు తెలిపింది. దేశంలోని ఇన్​ఫార్మల్​ సెక్టారే కరోనా టైములో బాగా దెబ్బతిందని చెబుతూ, పోయిన 12.2 కోట్ల ఉద్యోగాలలో 75 శాతం అంటే 9.2 కోట్లు ఈ రంగంలోనివేనని రిపోర్టు పేర్కొంది.

ఆత్మహత్యలు పెరిగాయ్‌‌..

లాక్​డౌన్​ టైములో దేశంలో 300 మంది ఇన్​ఫార్మల్​ వర్కర్లు ఆకలి, ఆత్మహత్యలు, రోడ్డు, రైలు యాక్సిడెంట్లు, పోలీసుల దాష్టీకాలు, సరైన టైముకి వైద్యం అందకపోవడం వల్ల  చనిపోయారని ఆక్స్​ఫామ్​ రిపోర్టు తెలిపింది. స్కూళ్లను దీర్ఘకాలంగా మూసివేయడంతో  పేద పిల్లలు స్కూళ్లను మానేయడం రెట్టింపవుతోందని పేర్కొంది.  దేశంలోని గ్రామాలలో నాలుగో వంతు మందికే ఇంట్లో కంప్యూటర్​ ఉందని, 15 శాతం మందికి ఇంటర్​నెట్​ కనెక్షనే లేదని వెల్లడించింది. ఏప్రిల్​ 2020లో 1.7 కోట్ల మహిళలు తమ ఉపాథి పోగొట్టుకున్నారని, లాక్​డౌన్​ ముందుతో పోలిస్తే మహిళలలో అన్​ ఎంప్లాయ్​మెంట్​ 15 శాతం పెరిగిందని రిపోర్టు పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, చాలా తీవ్రమైన సంక్షోభానికి దారి తీస్తాయని ఆక్స్​ఫామ్​ ఇండియా సీఈఓ అమితాబ్​ బెహార్​ తెలిపారు. పేద, సంపన్నుల మధ్య గ్యాప్​ను పాలసీలతో తగ్గించే వీలుంటుందని, దీనికి ప్రభుత్వం పెద్ద పీట వేయాలని పేర్కొన్నారు.

ఒక శాతం పన్ను వేస్తే అందరికి మెడిసిన్స్ ఇవొచ్చు..

ప్రజల ఆరోగ్యంపై గవర్నమెంట్​  ఖర్చు చాలా తక్కువగా ఉంటోందని ఆక్స్​ఫామ్​ రిపోర్టు అభిప్రాయపడింది. ఇండియాలోని టాప్​ 11 మంది బిలినియర్లు ఒక్కొక్కరిపై ఒక్క శాతం పన్ను విధిస్తే వచ్చే మొత్తంతో జన్​ ఓషధి స్కీము కేటాయింపును 140 రెట్లు పెంచొచ్చని కూడా ఆక్స్​ఫామ్​ రిపోర్టు వెల్లడించింది. దేశంలోని పేద ప్రజలకు మెడిసిన్స్​ను అందుబాటు ధరలలో ఇచ్చేందుకు జన్​ ఓషధి స్కీమును ప్రభుత్వం తెచ్చిన విషయం తెలిసిందే. లాక్​డౌన్​ను చాలా స్ట్రిక్ట్​గా ముందుగానే ఇండియా అమలు చేసిందని, దీంతో ఎకానమీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని చెబుతూ, ఫలితంగా అన్​ ఎంప్లాయ్​మెంట్​, ఆకలి, వలసలు పెరగడమే కాకుండా, చెప్పుకోలేని ఎన్నో కష్టాలను ప్రజలు ఎదుర్కొన్నారని ఆక్స్​ఫామ్​ రిపోర్టు వివరించింది. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని సంపన్నులు చాలా సులభంగా ఎదుర్కోగలిగారని, వైట్​కాలర్​ వర్కర్స్​ ఇళ్ల నుంచే పనిచేశారని, కానీ చాలా మంది దురదృష్టవంతులు తమ జీవనోపాథినే కోల్పోయారని తెలిపింది. కోల్​, ఆయిల్, టెలికం, మెడిసిన్స్​, ఫార్మాస్యూటికల్​, ఎడ్యుకేషన్, రిటెయిల్​ వంటి సెక్టార్లలో కార్యకలాపాలున్న గౌతమ్​ అదాని, శివ్​ నాడార్​, సైరస్​ పూనావాలా, ఉదయ్​ కోటక్​, అజీమ్​ ప్రేమ్​జీ, సునీల్​ మిట్టల్, రాధాకిషన్​ దమాని, కుమార మంగళం బిర్లా, లక్ష్మీ మిట్టల్​ వంటి బిలినియర్లు మార్చి 2020 నుంచి తమ సంపదను భారీగా పెంచుకున్నారని రిపోర్టు తెలిపింది.

For More News..

అక్కాచెల్లెళ్ల హత్య కేసు అప్‌డేట్: కలషంలో నవధాన్యాలు పోసి.. నోట్లో పెట్టి కొట్టి చంపిన తల్లి

ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్

Latest Updates