యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి  ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీతో పాటు మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండడంతో అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Latest Updates