దివ్యాన్ష్.. షూటింగ్ లో నయా సెన్సేషన్

Divyansh Singh Panwar: Another teenage Indian top gun shooter

షూటింగ్ లో అదరగొడుతున్న మరో టీనేజర్

మను భాకర్‌ , సౌరభ్‌ చౌదరి, అనీశ్‌ భన్వాలా, శార్దుల్‌ విహాన్‌ , లక్ష్యయ్‌ షెరాన్‌ , మెహులీ ఘోష్‌ ..కొంతకాలం గా ఇండియా షూటింగ్‌ లో మార్మోగుతున్న పేర్లు. అంతర్జాతీయ టోర్నీలో పతకాల మోత మోగిస్తున్న ఈ టీనేజ్‌ షూటర్ల జాబితాలో మరొకరి  పేరు చేరింది. ప్రపంచ చాంపియన్లు, ఒలింపిక్‌ విజేతలు,మేటి షూటర్లు బరిలో నిలిచిన వరల్డ్‌ కప్‌లో రెండు మెడల్స్‌ కొట్టి .. ఒలింపిక్‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నఆ షూటర్‌ ఇప్పుడు నయా సెన్సేషన్‌ గా మారాడు. వయసు 16 ఏళ్లే అయినా తన గురితో అదరహో అనిపిస్తున్న అతని పేరు దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వ ర్‌ . జైపూర్‌ లో పుట్టిన ఈ కుర్రాడు వరల్డ్‌ షూటింగ్‌ లో జైత్రయాత్ర  చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అది జైపూర్‌ లోని జగత్‌ పురా షూటింగ్‌ రేంజ్‌ .అక్కడి 10 మీటర్ల  షూటింగ్‌ హాట్‌ ఎంట్రేన్స్ దగ్గర ఓ ఫొటో కలెక్షన్‌ ఉంది. రాజ్యవర్దన్‌ సింగ్‌ రాథోడ్‌ , కర్ణి సింగ్‌ , ఓమ్‌ ప్రకాశ్‌ మితర్ వాల్‌ , అపూర్వీ చండేలా వంటి మేటి క్రీడాకారుల ఫొటోలు ఉన్నకలెక్షన్‌ లో ఇప్పుడు దివ్యాన్ష్ సింగ్‌ పన్వర్​ను కూడా చేర్చాల్సిన టైమ్‌ వచ్చింది. బీజింగ్‌ లో జరిగిన ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ స్వర్ణం , రజతం నెగ్గడమే కాకుండా ఒలింపిక్‌ కోటా ఖాతాలో వేసుకున్న10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటర్‌  పన్వర్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ గా మారిపోయాడు.

తీవ్రమైన పోటీ,మరెంతో ఒత్తిడి ఉండే వరల్డ్‌ కప్‌ లో ఒక్క పతకం నెగ్గితేనే గొప్ప. కానీ, అనుకోకుండా  షూటింగ్‌ లో అడుగుపెట్టి.. చాలా చిన్న వయసులో, అతి తక్కు వ అనుభవంతో బరిలోకి దిగిన దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతమే చేశాడు. సీనియర్‌ షూటర్‌ అంజుమ్‌మౌద్గి ల్‌ తో కలిసి 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ లో అలవోకగా గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకున్నా డు. ఆపై, 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ లో సిల్వర్‌ నెగ్గాడు. కేవలం 0.4 పాయింట్‌ తేడాతో మరోస్వర్ణం  కోల్పో యాడు. కానీ, రెండో గోల్డ్‌ రాకపోయినా.. మరో రకంగా అతడిని అదృష్టం వరించింది.ఈ ఈవెంట్‌ లో చైనాకు ఇప్పటికే రెండు ఒలింపిక్‌ కోటాలు ఖరారు కావడంతో సిల్వర్‌ తోనే పన్వర్‌ ఒలింపిక్‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకున్నా డు. తన రెండో వరల్డ్‌ కప్‌ లోనే ఇంత గొప్పగా రాణించడం చూస్తే ఈ టీనేజ్‌ షూటర్‌ కు మంచి భవిష్యత్‌ ఉన్నదనిస్తోంది.

డాక్టర్ల ఫ్యామిలీ నుంచి షూటర్‌

పన్వర్‌ అనుకోకుండా షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా డు. అతడి పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇద్దరూ డాక్టర్లు . అంకుల్‌ , నలుగురు కజిన్లు కూడా మెడికల్‌  ఫీల్డ్‌ లోనే ఉండడంతో తాను కూడా వారి బాటలో నడవాలని దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావిం చాడు. అందుకే11వ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయాలజీ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నా డు కూడా. కానీ, విధి అతడిని అసలు చోటు చేర్చింది. జగత్‌ పురా షూటింగ్‌ రేంజ్‌ కు చెందిన ఓ గార్డ్‌ వైద్యం కోసం దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తండ్రి వద్ద కు వచ్చా డు. అతనితో మాట్లాడిన తర్వాత దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తండ్రికి షూటింగ్‌ పై ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిగింది. అప్పటికి పన్నెండేళ్ల  వయసున్న పన్వర్‌ ను షూటిం గ్‌ రేంజ్‌ కు తీసుకెళ్లి ‘రేపటి నుంచి నువ్వు ఇక్కడ  షూటింగ్‌ నేర్చుకుంటున్నావు’ అనిచెప్పా రు. అప్పటి నుంచి దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షూటింగే లోకం అయింది. రెండేళ్ల కిం దట జూనియర్‌ నేషనల్‌ క్యాంప్‌ లోకి వెళ్లిన తర్వాత అతడి కెరీర్‌ పదునెక్కింది.

అల్లరి పిల్లోడు.. టాలెంట్ ఉన్నోడు

షూటింగ్‌ లో రాణిం చాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. పన్వర్‌ కు ఈ ఆటే ప్రాణం అనుకున్నా సగటు టీనేజ్‌ కుర్రాడిలా అతను కూడా అల్లరి చేసేవాడు. కానీ, దాని డోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్త ఎక్కు వగా ఉండేది.అతనికి కాస్త బద్దకం కూడా. షూటిం గ్‌ రేంజ్‌ లో మిగితా టీనేజర్లు కేవలం ఆటపైనే దృష్టి పెడితే దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం వీడియో గేమ్‌లు ఆడేవాడు. ప్రాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతూ సహచరులను ఆట పట్టిస్తుండే వాడు.రెండేళ్ల కిందట జూనియర్‌ నేషనల్‌ క్యాంప్‌ లో పన్వర్‌ను తొలిసారి చూసి నప్పుడు  ఇండియా నేషనల్‌ కోచ్‌ దీపాలి దేశ్‌ పాండే చాలా ఆశ్చర్యపోయిం ది.అతడి వ్యవహార శైలి చూసి.. అసలు ఈ కుర్రాడు షూటింగ్‌ కు పనికొస్తాడా అనుకుంది. కానీ, షూటింగ్‌ రేంజ్‌ లోకి వచ్చాక అతని టాలెంట్‌ చూశాకతన అభిప్రాయం మార్చుకుంది. టెక్నిక్‌ లేకున్నాటార్గె ట్‌ ను గురి చూసి కొడుతున్న విధానం ఆమెను కట్టిపడేసింది. చాలా మంది యువ షూటర్లు గన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిశితంగా పరిశీలిస్తుంటే .. పన్వర్‌ ఎలాంటి అనలైసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా  సింపుల్‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గురి చూసికొట్టేవాడు. దాం తో, దీపాలి, ఇతర కోచ్‌ లు క్యాంప్‌లో అతడిని ఓ కంట కనిపెడుతూ ట్రెయినింగ్‌ ఇచ్చారు.

చెప్పి మరీ వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టి

పైకి అల్లరి కుర్రాడిగా కనిపించినా..తన లక్ష్యం ఏమిటో దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాగాతెలుసు. కానీ, అతడిపై పూర్తి నమ్మకం కుదరడానికి కోచ్‌లకు కొం త సమయంపట్టిం ది. గతేడాది జర్మనీలో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ కప్‌ లో ఎలవెనిల్‌ తో కలిసి 10 మీ. మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ లో స్వర్ణం నెగ్గడంతో పన్వర్‌ కెరీర్‌ కీలక మలుపు తిరిగింది. అతడి ఆశయం ఏమిటో కూడా ఈ టోర్నీలోనే కోచ్‌ లకు తెలిసింది. మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌ క్వాలిఫికేషన్‌ లో దివ్యాన్ష్–ఎలవెనిల్‌  జంట టాప్‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫైనల్‌ కు అర్హత సాధించింది. షూట్​ తర్వాత తాము వరల్డ్‌ రికార్డు నెలకొల్పమా అని కోచ్‌ సుమాషి రుర్‌ ను పన్వర్‌ అడిగాడు. లేదు అని అంటే .. ‘ఫైనల్లో రికార్డు అవుతుంది చూడండి’ అన్నా డు దివ్యాన్ష్. చెప్పినట్టు గానే తుది రౌండ్‌ లో వరల్డ్‌ రికార్డు సృష్టిస్తూ దివ్యాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంట గోల్డ్‌ నెగ్గిం ది. ఆశ్చర్యపోవడం కోచ్‌ వంతైంది. దటీజ్​ దివ్యాన్ష్ . తాజా వరల్డ్‌కప్​ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మరెంతో మందిని అబ్బురపరిచిన ఈ టీనేజ్‌ షూటర్‌ ఇదే జోరు కొనసాగిస్తే మరెన్నో పతకాలు,రికార్డులు బద్దలు కొట్టడం పక్కా.

Latest Updates