నా తల్లికి కరోనా సోకింది : నా 45మంది కుటుంబసభ్యుల్ని కాపాడాలంటూ వేడుకున్న ప్రముఖ నటి

నా తల్లికి కరోనా సోకింది. ఎవరూ పట్టించుకోవడం లేదని, ట్రీట్ మెంట్ అందించాలంటూ  ప్రముఖ నటి దీపికా సింగ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ను వేడుకుంది.

దియా అవుర్ బాతీ హ‌మ్ సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా సింగ్ ఢిల్లీలోని పహర్‌ గంజ్ ప్రాంతంలో 45 మంది ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది.

అయితే కొద్దిరోజుల క్రితం తన తల్లికి కరోనా లక్షణాలు బయట పడ్డాయని.. ఢిల్లీలోని హార్డింగ్ మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించగా త‌న త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో షాక్‌కి గురైనట్లు తెలిపారు. ట్రీట్మెంట్ కోసం పలు ఆస్పత్రుల్ని సంప్రదించగా బెడ్ లు ఖాళీ గా లేవని చెబుతున్నారని, ప్రస్తుతం తన తల్లితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులలోని కొంత మందికి అనారోగ్యంగా ఉందంటూ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపికా సింగ్ పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్ కావ‌డంతో శ‌నివారం ఆమె త‌ల్లిని హాస్పిట‌ల్‌లో చేర్పించామ‌ని డిప్యూటీ కమిషనర్ అభిషేక్ సింగ్ ట్వీట్ చేయ‌గా ఇంకా లేదు. మా అమ్మ ఇంట్లోనే ఉంది అంటూ దీపికా రిప్లై ఇచ్చారు. త‌న నానమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంద‌ని వెంట‌నే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించాలని కోరారు.

కాగా దీపికా సింగ్ వీడియోపై ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం స్పందించారు. ఆమె తల్లికి సర్ గంగారామ్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ ఇప్పించేలా అధికారుల్ని ఆదేశించారు.

Latest Updates