40 ఏళ్ల డీజే.. ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా ఉందంటూ సెల్ఫీ పోస్ట్: అంత‌లోనే..

యూకేలో పాపుల‌ర్ డీజే.. మంచి ఫుట్ బాల్ ప్లేయ‌ర్.. ఒక ఫుట్ బాల్ క్ల‌బ్ సెక్రెట‌రీ కూడా.. ఎప్పుడూ చ‌లాకీగా ఉండే 40 ఏళ్ల‌ డానీ శ‌ర్మ‌.. క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్ చికిత్స పొందుతూ విండో ప‌క్క‌ బెడ్ పై ఉన్న డానీ… ‘కిటికీలో నుంచి చూస్తుంటే చాలా బాగుంది. బ‌య‌ట ఎండ‌లోకి వెళ్లే వీలుంటే ఇంకా బాగుండు. ఊపిరి పీల్చుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంది. ఇంకా పోరాడుతూనే ఉన్నా; అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన రెండు రోజుల‌కే మృత్యువుతో పోరాటంలో ఓడిపోయాడు.

వెస్ట్ లండ‌న్ లోని ఉక్స్ బ్రిడ్జ్ టౌన్ కు చెందిన డానీ శ‌ర్మ గ‌త వారంలో క‌రోనాతో హిల్లింగ్డ‌న్ హాస్పిట‌ల్ లో చేరాడు. ఈ నెల 21 నుంచి అత‌డు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్ డేట్స్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నాడు. తాను హిల్లింగ్డ‌న్ హాస్పిట‌ల్ లో ఉన్నాన‌ని, ఎవ‌రైనా త‌న కోసం డ్రింక్స్ తీసుకొస్తారా అని అడుగుతూ ఫేస్ బుక్ పేజీలో రాశాడు డానీ శ‌ర్మ‌. ఆ త‌ర్వాతి రోజు త‌న జీవితం దారుణంగా త‌యారైంద‌ని, త‌న‌కు క‌రోనా వైర‌స్ సోకిందంటే న‌మ్మలేక‌పోతున్నానంటూ పోస్ట్ పెట్టాడు. 23న డే త్రీ అప్ డేట్ అంటూ తాను హమ‌ర్ స్మిత్ ఆస్ప‌త్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాన‌ని టెస్టులు, ఎక్స్ రే చేశార‌ని, అయితే మూడు రోజుల పాటు హిల్లింగ్డ‌న్ లో ఏమీ చేసింది లేద‌ని పోస్ట్ చేశాడు. ఊపిరితిత్తుల్లో క‌రోనా ఇన్ఫెక్ష‌న్ చేరింద‌ని, త‌న శ‌రీరం రిక‌వ‌రీ అయ్యేందుకు ఏడు రోజుల పాటు కోమాలో ఉంచి చికిత్స చేయాల‌ని అనుకుంటున్నార‌ని, కానీ కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా అది కుద‌రడంలేద‌ని మెల‌కువ‌తోనే భ‌య‌ప‌డుతూ పోరాడాల్సి వ‌స్తోంద‌ని చెప్పాడు.

బ‌య‌ట‌కు రావాల‌నుందంటూ..

ఇక 24వ తేదీన డే ఫోర్ అప్ డేట్ అంటూ తాను ఆక్సిజ‌న్ మాస్క్ పెట్టుకుని, థంబ్సప్ సింబ‌ల్ చూపిస్తూ సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ లో పెట్టాడు డానీ. ‘కిటికీలో నుంచి చూస్తుంటే బ‌య‌ట చాలా బాగుంది. నేను కూడా ఎండ‌లో విట‌మిన్ – డి శ‌రీరానికి అందించాల‌ని కోరుకుంటున్నా. కానీ, నేను ఊపిరి పీల్చ‌డానికే క‌ష్టంగా పోరాడుతున్నా’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పెట్టిన రెండ్రోజుల్లోనే గురువారం ఉద‌యం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అత‌డి డీజే మిత్రులు, ఫుట్ బాల్ ప్లేయ‌ర్స్ అంతా సంతాపం ప్ర‌క‌టించారు. ఒక బంగారం లాంటి మ‌నిషిని కోల్పోయామంటూ త‌మ బాధ‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Day Four UpdateLooks nice out from the window wish I was participating in the Vitamin DFinding hard to breath still fighting

Posted by Danny Sharma on Tuesday, March 24, 2020

Latest Updates