సాజిదా సౌండ్ సెట్ చేస్తే ..ఫిదా అవ్వాల్సిందే

హైదరాబాద్: సినిమాకైనా, సీరియల్ కైనా, వెబ్ సిరీస్ కైనా సౌండ్ ఎఫెక్స్ట్ , ఆడియో కంపల్సరీ. ఏ సన్నివేశానికి ఏ మ్యూజిక్ సరిపోతుంది? ఎలా సెట్‌ చేయాలి? అన్నది సౌండ్ ఇంజనీర్ నైపుణ్యంపై ఆధారపడి ఉంటాయి. సినిమా మంచి అవుట్ పుట్ రావాలంటే సౌండ్ ఎఫెక్స్ట్ సరిగ్గా ఉండాలి. అలాంటి క్లిష్టమైన ప్రొఫెషన్ ని ఇష్టంగా చేస్తూ భారతదేశ మొదటి మహిళా సౌండ్ ఇంజనీర్ గా, మ్యూజిషియన్ గా నిలిచి, అరుదైన డాక్టరేట్ ని తన పేరు ముందు నిలుపుకున్నారుడా. సాజీదా ఖాన్. అనేక అవార్డులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు సాజిదా.

తొలి మహిళా సౌండ్ ఇంజనీర్ గా ..

నగరంలోని అల్వా ల్ లో ఉంటున్న డా. సాజిదా ఖాన్ 2005లో సౌండ్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించారు. అనుకోని సంఘటనలే కొన్ని సార్లు జీవితంలో మార్పులు తీసుకొస్తాయి అని చెప్పడానికి నిదర్శనమే సాజిదాఖాన్ జీవితం. ఇంటర్ పూర్తయ్యాక, డిగ్రీ లో చేరడానికి మధ్య వచ్చిన సెలవుల్లో ఓ రోజు శ్రీనగర్ కాలనీలోని ఆరినా రికార్డింగ్ స్డూడియో చూసేందుకు వెళ్లారు. అలా అక్కడ ఆడియో మిక్సింగ్, రికార్డింగ్ చూశాక ఒక ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు. దీంతో మల్టీమీడియాలో చేరి ఆడియో ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. శిక్షణ పూర్తయ్యాక గీతాంజలి రికార్డింగ్ స్టూ డియో లో నాలుగేళ్లు సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు. తర్వాత ఎల్జీ ఆడియో ల్యా బ్, మల్లెమాల ప్రొడక్షన్ హౌస్‌, ఆర్వీఎంఎల్ ప్రొడక్షన్ హౌస్‌ తదితర సంస్థల్లో పనిచేశారు. మ్యూజిక్ నేర్చుకోవాలన్న తపన, పై చదువులు సాగించాలనే కోరికతో ఫ్రీలాన్సర్ గా చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, డబ్బింగ్ సినిమాలతో పాటు, పాటలు, ఆల్బమ్స్, టెలీ సీరియల్స్, డాక్యుమెం టరీస్, ఆలిండియా రేడియో రికార్డింగ్ స్, రేడియో సీరియల్స్ కు పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్సర్ గా వెబ్ సీరిస్ లకి వర్క్ చేస్తున్నారు.

అవార్డులు.. రివార్డుల వెల్లువ..

2015లో దేశంలోనే మొదటి మహిళా మ్యూజిక్ టెక్నిషియన్ గా రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 2015 లో గ్రూప్ సాంగ్ పోటీల్లో జాతీయ అవార్డు, 2016లో విజయ్ వనిత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక సేవా రత్న, తెలుగు సాహిత్య కళాపీఠం, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తిరుపతి సిటీ చాం బర్స్, హర్ ఎక్స్ లెన్సీ అవార్డ్, ఇలా 30కి పైగా అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు 2018లో ఫస్ట్ ఫిమేల్ మ్యూజిక్ టెక్నిషియన్ గా కేంద్రం నుంచి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. తెలంగాణ కల్చరల్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆధ్వర్యంలో 2019 మార్చి 8న నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో విశిష్ట మహిళా పురస్కారం అందజేశారు. దీంతో పాటు మార్చి నెలలో (యూఎస్ ఏ) యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ (ఎక్స్ టర్ననల్ స్టడీస్అండ్ రీసెర్చ్ ) నుం చి డాక్టరే ట్ పొందారు. ఆన్ న్‌ జీకే గైడ్‌ అనే వెబ్ ట్‌ సంస్థ తయారు చేసిన 200 మంది లిస్టులోతో పాటు, ఫ్రీ ఆన్ న్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఫస్ట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌ సినిమా అండ్‌ మ్యాజిక్‌ కు సంబంధించి టాప్ 14 లిస్ట్ తయారు చేయగా అందులో స్థానం సాధించారు.

Latest Updates