సీఎం స్పందించకపోవడం బాధాకరం: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: వెటర్నరీ డాక్టర్​దారుణ హత్యపై సీఎం కేసీఆర్ స్పందించ కపోవడం బాధాకరమని బీజేపీ లీడర్, మాజీ మంత్రి డీకే అరుణ ఆవేదనవ్యక్తం చేశారు. ఈ దారుణంపై చులకనగా మాట్లా డిన మంత్రులను బర్తరఫ్​ చేయాలన్నారు. బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ చేపట్టిన మౌన దీక్షకు అరుణ సంఘీభావం తెలిపారు. తెలంగాణలో అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఇంటలిజెన్స్​ వ్యవస్థ
ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

సీఎం కేసీఆర్​ మాట్లాడరెందుకు ?

హైదరాబాద్‌‌, వెలుగు: వెటర్నరీ డాక్టర్‌‌ హత్య ఘటనపై సీఎం కేసీఆర్‌‌ ఇంతవరకు మాట్లాడక పోవడం బాధాకరమని, తక్షణమే స్పందించాలని కాంగ్రెస్‌‌ ఎమ్మెల్సీ జీవన్‌‌ రెడ్డి డిమాండ్‌‌ చేశారు. మహిళల వైపు చూస్తే గుడ్లు పీకేస్తామన్న కేసీఆర్‌‌ రాష్ట్రంలో ఇంత దారుణ ఘటన జరిగితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కూతురుకు ఎదురైన పరిస్థితి గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు పోలీసులు.. తమ పరిధిలోకి రాదని, కేసును తీసుకోకపోవడం అన్యాయమన్నారు.

Latest Updates