‘చలో ట్యాంక్‌బండ్’ లక్ష్యం నెరవేరింది

ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోగా, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆర్టీసీ కార్మికులు నేడు ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమానికి విపక్షాలు మద్దతు పలికాయి. అందువల్ల విపక్ష నాయకులు ఎవరూ ట్యాంక్‌బండ్ పరిసరాలలోకి వెళ్లకుండా పోలీసులు నాయకులను వారివారి ఇళ్ల వద్దనే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ నేతలు డీకే. అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన డీకే. అరుణ మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ నిర్వహించదలచిన మిలియన్ మార్చ్‌ను నిర్బంధాలతో అడ్డుకోలేరని ఆమె అన్నారు. కేసీఆర్ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆమె మండిపడ్డారు. పోలీసులు నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినా మిలియన్ మార్చ్ ఏమాత్రం ఆగలేదని, కార్యక్రమ లక్ష్యం నెరవేరిందని ఆమె అన్నారు.

Latest Updates