కరోనా కట్టడికి మరిన్ని చర్యలు: సీఎం కేసీఆర్ కు డీకే అరుణ లేఖ

జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు మాజీ మంత్రి డీకే అరుణ. దీనికి సంబంధించి మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.Random గా పరీక్షలు నిర్వహించి పరిస్థితి అదుపులోకి రావడానికి వైరస్ వ్యాప్తి మూలలను గుర్తించాలంటూ ఆ లేఖలో తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయన్నారు. జిల్లాకు ప్రత్యేక అధికారి నియామకం, ఉన్నతాధికారుల సందర్శన చ‌ర్య‌లు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హోమ్ క్వారన్ టైన్ లో ఉన్నవారందరికీ Random గా టెస్ట్ లు చేస్తే తప్ప వైరస్ మూలాలు అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడిందిన్న డీకే అరుణ..ఈ మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితిలో తక్షణ చర్యలు తీసుకోవాల‌ని లేఖలో విజ్ఞ‌ప్తి చేశారు.

Latest Updates