శివ కుమార్ కు 10రోజుల ED కస్టడీ

మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ నేత డి. శివకుమార్ కు పదిరోజుల కస్టడీని విధించింది ఢిల్లీ ట్రయల్ కోర్టు.  కేసు కీలక దశలో ఉందని శివకుమార్ దర్యాప్తుకు సహకరించడంలేదని.. 14 రోజుల రిమాండ్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో… 14 రోజులకు బదులుగా 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. రిమాండ్ లో శివకుమార్ ను అతని కుటుంబసభ్యులు కలువొచ్చని చెప్పింది కోర్ట్.

నిన్న రాత్రి శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసినప్పటినుంచి బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో బెంగళూరులోని RML హాస్పిటల్ లో వైద్య పరిక్షలు చేయించి బుధవారం కోర్టుకు హాజరుపరిచారు అధికారులు.  శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో హింసాత్మక ఘటనలు జరిగాయి. పలు చోట్ల బస్సు అద్దాలను ఆందోళనకారులు పగులకొట్టారు. స్కూల్ లను బలవంతంగా మూసివేశారు.

Latest Updates