డక్‌వర్త్‌–లూయిస్‌లో.. లూయిస్‌ ఇక లేరు

లండన్‌‌: ‘డక్‌‌వర్త్‌‌ – లూయిస్‌‌ మెథడ్‌‌’ క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ అందరికీ బాగా తెలిసిన రూల్‌‌.  క్రికెట్‌‌ నిబంధనల్లో చాలామందికి అర్థం కాని రూల్‌‌ కూడా ఇదే. లిమిటెడ్‌‌ ఓవర్‌‌ మ్యాచ్‌‌లకు వర్షం ఇబ్బంది కలిగించినప్పుడు వాడుతుంటారు. ఈ రూల్‌‌ను తయారు చేసిన వారిలో ఒకరైన టోనీ లూయిస్‌‌(78)  బుధవారం మరణించారు. టోనీ లూయిస్‌‌ మరణ వార్తను ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌ బోర్డు(ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. కానీ మరణానికి గల కారణాన్ని వెల్లడించలేదు. క్రికెట్‌‌కు లూయిస్‌‌ చేసిన సేవలు మరువలేనివంటూ ఐసీసీ కూడా నివాళి తెలియజేసింది. సహచర మేథమెటీషియన్‌‌ ఫ్రాంక్‌‌ డక్‌‌వర్త్‌‌తో కలిసి లూయిస్‌‌ 1997లో డక్‌‌వర్త్‌‌ లూయిస్‌‌ మెథడ్‌‌ను పరిచయం చేశారు. ఆ తర్వాత 1999లో ఐసీసీ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. కొన్నేళ్ల తర్వాత స్టీవెన్‌‌ స్టర్న్‌‌ అనే  స్టాటేస్టిషీయన్‌‌ ఈ విధానానికి కొన్ని సవరణలు చేశాడు. దీంతో 2014 నుంచి ఇది డక్‌‌వర్త్‌‌–లూయిస్‌‌–స్టర్న్‌‌ మెథడ్‌‌గా మారింది.

బ్రేక్ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్న సింధు

 

Latest Updates