డీమార్ట్ విలువ రూ.1.5 లక్షల కోట్లు

ముంబై : డీమార్ట్‌‌ మార్కెట్‌ క్యాపి టలైజేషన్ సోమవారం రూ. 1.5 లక్షల కోట్లను దాటింది. బజాజ్‌‌ ఫిన్‌‌సర్వ్‌‌, నెస్లే ఇండియాలను ఈ క్రమంలో ఎవెన్యూ సూపర్‌‌ మార్స్‌ట్ (డీమార్ట్‌‌ నిర్వహించే కంపెనీ) వెనక్కి నెట్టింది. ఎవెన్యూ సూపర్‌‌ మార్స్‌ట్ షేర్‌‌ సోమవారం 11 శాతం పెరిగి రూ. 2,537 కి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ వాల్యుయేషన్‌‌ రూ. 1.55 లక్షలకోట్ల మార్కును చేరుకుంది. ఫలితంగా మార్కెట్‌ క్యాప్‌ పరంగా బీఎస్‌‌ఈలో 18 వ ప్లేస్‌‌ను ఎవెన్యూ సూపర్‌‌ మార్స్‌ట్ అందుకుంది. టాప్‌ 20 వాల్యూడ్‌‌ కంపెనీల జాబితాలో కిందటి వారమే చేరింది ఎవెన్యూ సూపర్‌‌మార్స్‌ట్. కిం దటి వారంలో క్వాలిఫైడ్‌‌ ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ ప్లేస్‌‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా రూ.4,098 కోట్లను కంపెనీ సేకరించింది. స్టోర్స్‌‌ నెట్‌ వర్క్‌‌ విస్తరణ, సప్లైచెయిన్‌‌, అప్పులు తీర్చేందుకు ఈ డబ్బును వాడనున్నట్లు కంపెనీ తెలిపింది. క్యూఐపీ కింద 2 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ. 1,999.04ఫ్లోర్‌‌ ధరకు జారీ చేయాలని ఎవెన్యూ సూపర్‌‌ మార్స్‌ట్ నిర్ణయించింది. 2002 లో ముంబైలో మొదటి స్టోర్‌‌ తెరిచిన ఈ కంపెనీ 2017 మార్చి 21న స్టాక్‌‌ మార్కెట్లో లిస్టయింది. 2019 డిసెంబర్‌‌ నాటికి ఎవెన్యూ సూపర్‌‌మార్స్‌ట్ కు దేశవ్యాప్తంగా 196 స్టోర్లున్నా యి.సోమవారం ట్రేడింగ్‌ ముగిసేప్పటికి ఎవెన్యూ సూపర్‌‌మార్స్‌ట్ షేర్‌‌ 8.5 శాతం లాభంతో రూ. 2,481 వద్దముగిసింది.

Latest Updates