రిటైర్మెంట్ రోజునే హెల్త్ ఆఫీస‌ర్ కీల‌క నిర్ణ‌యం

విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్స్  అనుమతులు రద్దు

విజయవాడలో ప్రభుత్వ నిబంధనలకు పాతరేసిన అన్ని ప్రైవేట్ కోవిడ్ సెంటర్స్ అనుమతులు రద్దు చేశారు. విజయవాడలోని మొత్తం 22 కోవిడ్ సెంటర్స్ ల‌లో ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని గుర్తించిన కారణంగానే అనుమతుల రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. డాక్టర్ల బృందం పరిశీలనలో లోపాలు గుర్తించి లైసెన్స్ రద్దు చేసినట్టు DMHO డాక్టర్ రమేష్ చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో బెజవాడలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రస్తుతం కోవిడ్ వైద్యం అందించనున్నారు. అయితే తన సర్వీసులో చివరి రోజున DMHO రమేష్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Latest Updates