కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తుంది. కరోనాతో చికిత్స పొంతుతూ డీఎంకే కీలక నేత, ఎమ్మెల్యే అన్ బజగన్(61) మృతి చెందారు. కరోనా సోకడంతో గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో  అన్ బజగన్ కు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. బజగన్ కు గతంలో కాలేయ మార్పిడి జరగడం, దీంతో పాటు  ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని డాక్టర్లు తెలిపారు.

లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు పెద్ద ఎత్తున నిత్యవసరాలు పంపిణీ చేశారు.  మన రాష్ట్ర గవర్నర్ తమిళి సై రెండు రోజుల క్రితం ఆయనకు మందులు పంపించినట్లు సమాచారం. బజగన్ చెపాక్-తిరువల్లికెనీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Latest Updates