DNAతో పరిష్కారం : తల్లి ఒడికి చేరిన తారుమారు బిడ్డలు

DNAజగిత్యాల జిల్లా  ప్రభుత్వ ఏరియా  ఆస్పత్రిలో  కొద్ది రోజుల  క్రితం  జరిగిన శిశువుల తారుమారు  ఘటన పరిష్కారం  అయ్యింది. DNA  రిపోర్టు  ఆధారంగా గుర్తించి.. తారుమారైన  పిల్లలను  తిరిగి అమ్మఒడి కి  చేర్చారు. ఈ ఘటనపై  జాయింట్ కలెక్టర్ రాజేశం ఆస్పత్రిని  సందర్శించారు. విచారణ  జరిపి  నిర్లక్ష్యం వహించిన  సిబ్బందిని సస్పెండ్  చేస్తూ  ఆదేశాలు ఇచ్చారు . రెండు సార్లు  DNA  రిపోర్టు కోసం  అయిన ఖర్చును..  విధుల్లో  నిర్లక్ష్యం వహించిన  సిబ్బంది  నుంచి  వసూలు చేసి… ఇప్పిస్తామన్నారు  సూపరింటెండెంట్.

మద్దునూర్‌ కు చెందిన బొంగురాల మహేందర్, చామంతి దంపతులు మాట్లాడుతూ ..మొదటి నుంచీ శిశుమార్పిడి జరిగిందని చెబుతున్నామని, డాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. 15 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉన్నామని, ఉన్న పొలాన్ని కుదవపెట్టి DNA రిపోర్ట్‌ కోసం రూ.21 వేలు ఖర్చు చేశామని చెప్పారు.  మరో రూ.9 వేల వరకు శిశువు ట్రీట్ మెంట్ కోసం  ఇచ్చామని తెలిపారు. మొత్తానికి తనబిడ్డపై క్లారిటీ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు ఇద్దరు బిడ్డల తల్లిదండ్రులు.

Posted in Uncategorized

Latest Updates