కరోనాపై అనుమానాలు.. అమెరికా సైంటిస్ట్ సమాధానాలు

అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఫహీమ్ యూనస్ కరోనా వైరస్ గురించి  ప్రజల్లో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అవేంటో తెలుసుకుందాం.

అపోహ: 1.దోమల వల్ల కరోనా వైరస్ సోకుతుందా..?

వాస్తవం: దోమల వల్ల కరోనా వైరస్ వ్యాపించదు. వైరస్ రక్తంలో కాకుండా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు పడే తుంపర్ల  ద్వారా వ్యాపిస్తుంది. దోమలు వైరస్‌ను వ్యాపింపచేయలేవు.

2.ఎటువంటి ఇబ్బంది లేకుండా పదిసెకన్ల పాటు శ్వాస తీసుకోకుండా ఉంటే కరోనా లేనట్లేనా..?

అబద్ధం.  కరోనా వైరస్ సోకినా కూడా యువకులు 10 సెకన్ల కన్నా ఎక్కువ సేపు శ్వాస తీసుకోకుండా ఉండగలరు. కరోనా వైరస్ బారినపడకున్నా కొందరు వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు.

3. కరోనా టెస్ట్ అందరికీ అందుబాటులో లేదు. బ్లడ్ డొనేట్ చేస్తే బ్లడ్ బ్యాంక్‌లో చెక్ చేసి చెబుతారా?

కరోనా వైరస్ టెస్ట్ ఏ బ్లడ్ బ్యాంక్‌లో లేదు. రక్తదానం అనేది ఓ పవిత్ర కార్యం. ఇలా టెస్టుల కోసం కాకుండా… ప్రతీ ఒక్కరు రక్తదానం చేసేలా ఎంకరేజ్ చేద్దాం.

4. కరోనా వైరస్ గొంతులో ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువ తాగితే.. ఆ వైరస్ కడుపులోకి వెళుతుంది. అలా వెళ్లిన వైరస్ ను ఆమ్లాలు చంపుతాయా..?

వైరస్ గొంతు ద్వారా లోపలికి వెళ్లవచ్చు. కానీ దాన్ని చంపడం సాధ్యం కాదు. కరోనా వైరస్ హోస్ట్ సెల్స్ కణాల్లోకి చొచ్చుకెళతాయి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల టాయిలెట్ కు వెళతారు తప్పితే అందులో ఎలాంటి ఉపయోగం లేదు.

5. కారు ప్రమాదంలో సంవత్సరానికి 30వేల మంది చనిపోతున్నారు. మరి కరోనా దానికన్నా పెద్ద ప్రమాదమా..?

కారు ప్రమాదం అంటువ్యాధి కాదు,  కారు ప్రమాదాల సంభవించిన మరణాలు ప్రతీ మూడు రోజులకు రెట్టింపు కావు. అన్నీ రంగాల్ని ఇబ్బంది పెట్టేంత ప్రమాదం కాదు. కానీ కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

6. సబ్బు, నీటి కంటే హ్యాండ్ శానిటైజర్లు మంచివా?

తప్పు. సబ్బు మరియు నీరు వైరస్‌ను హతమారుస్తాయి. నీటితో, సబ్బుతో చేతుల్ని క్లీన్ చేసుకోవడం వల్ల చేతులకు ఉన్న వైరస్ తొలగిపోతుంది. హ్యాండ్ శానిటైజర్లు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా ఆందోళన చెందాల్సిందేమీ లేదు. సబ్బు వాడుకోవచ్చు.

7. కరోనా వైరస్‌ను నివారించేందుకు ఇంటి డోర్లను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలా?

అవసరం లేదు. దగ్గు, జలుబు, జ్వరంతోబాధపడుతున్నవారికి దూరంగా ఉండండి. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఇంట్లో విడిగా ఉంచడం మంచిది. వారికి కనీసం రెండు మీటర్ల దూరంగా ఉండాలి. ఒక వేళ ఇంట్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చేరితే.. ఒకసారి ఇంటిని బ్లీచ్, క్లోరిన్ లేదా ఆల్కహాల్ బేస్ట్ లిక్విడ్స్‌తో క్లిన్ చేసుకోవడం మేలు. 

8. కరోనా వైరస్ ఉద్దేశపూర్వకంగా  అమెరికన్ లేదా చైనీస్ మిలటరీ ద్వారా వ్యాపించిందా?

నిజమా (కచ్చితంగా చెప్పలేం).

9. వేసవిలో కరోనా నశిస్తుందా? 

సీజన్‌తో ఈ వైరస్‌కి సంబంధం లేదు. ఈ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. భూమిపై ఇప్పుడు కొన్ని దేశాల్లో చలికాలం నడుస్తుంటే, మరికొన్ని దేశాల్లో ఎండాకాలం నడుస్తోంది. గతంలో వచ్చిన భయంకరమైన వ్యాధులపై సీజన్ల ప్రభావం లేదు.

Latest Updates