ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాను బ్లాక్ చేయొద్దు

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర సర్కార్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: సరిహద్దు నియంత్రణ సాకుతో చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గమనించింది. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేయొద్దని అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఆస్పత్రుల్లో చేరిన ప్రతి కరోనా పేషెంట్‌‌‌కు ఆక్సిజన్ అందేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ సెక్రటరీ లేఖ పంపింది. ఈ నెల 1 నుంచి అన్‌‌లాక్ నాలుగో ఫేజ్ మొదలైంది. దీంతో రాష్ట్రాల నడుమ బార్డర్ నియంత్రణలు తొలగిపోయాయి. అయినా సరే కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ సిలిండర్ల సప్లయిని పరిమితం చేయడానికి యత్నిస్తున్నాయని కేంద్రం గమనింపులోకి వచ్చింది. దీంతో మెడికల్ ఆక్సిజన్ ఎస్సెన్షియల్ పబ్లిక్ హెల్త్ కమోడిటీ అని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం సూచించింది.

Latest Updates