బ్రష్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పళ్లను క్లీన్ గా ఉంచుకుంటే సగం జబ్బులు మన దరికి చేరనే చేరవు. సరైన అవగాహన లేక ఈ విషయంలో ఎంతో మంది తప్పు చేస్తుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు, పళ్లను అదేపనిగా బ్రష్ తో తోమడం వల్ల ఎనామెల్ పొర కరిగి పళ్లు మరీ సున్నితంగా తయారవుతాయి. ఈ సమస్య ఇప్పుడు చాలా మందికి ఎదురవుతుంది. అయితే చిన్న జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. బ్రష్, టూత్ పేస్ట్ ల విషయంలో జాగ్రత్త పాటించాలి. సాఫ్ట్ గా ఉండే బ్రష్ ను ఎంచుకుంటే మంచిది. అలానే దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించకూడదు. ప్రతి రెండు నెలలకూ ఒకసారి బ్రష్ ను మార్చాలి. అలానే అదే పనిగా ఎక్కువసేపు పళ్లనుతో మకూడదు.

కెమికల్స్ తక్కువ ఉన్న పేస్ట్ ను సెలక్ట్ చేసుకోవాలి. వీలైనంత తక్కువ పేస్ట్ ను వాడాలి. ఒకే బ్రాండ్ ను కొనసాగిం చడం మంచిది. ప్రతిసారీ కొత్తబ్రాండ్ ను వాడటం వల్లా సమస్యలు ఉంటాయి. ఉదయంతో పాటు, రాత్రిపూటా బ్రష్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. అయితే రాత్రిపూట పేస్ట్ బదులుగా సాల్ట్ ను ఉపయోగించొచ్చు. ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. పళ్ల మీద ఎంత శ్రద్దను పెడుతున్నామో, చిగుళ్లను క్లీన్ చేసుకోడానికీ అంతే జాగ్రత్తను చూపాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, పళ్లను సున్నితంగా క్లీన్ చేసుకుంటే ఎన్నో దంత సమస్యల నుంచి బయటపడొచ్చు.

see also:

రైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం

జాబ్ చేస్తూ చేసే బిజినెస్ లేంటో తెలుసా

షాద్ నగర్‌లో ఓ ఇంటి దాబాపై చిరుత హల్‌చల్

Latest Updates