పెళ్లి గిఫ్ట్ వద్దు..మోడీకి ఓటేయండి: హైదరాబాదీ అభిమానం

ప్రధాని మోడీపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు హైదరాబాద్ కు చెందిన ఓ వీరాభిమాని. హైదరాబాద్ శంషాబాద్ కు చెందిన 27 ఏళ్ల ముఖేష్‌ రావు కు ఈ నెల 21న మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. పెళ్లి కోసం ఫ్రింటింగ్ చేసిన వెడ్డింగ్ కార్డులో ….వివాహానికి వచ్చే వారు ఎలాంటి బహుమతులను తీసుకురావద్దని..వాటికి బదులుగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేసి.. మోడీని ప్రధానిగా మరోసారి గెలిపించండి  అంటూ అచ్చువేయించాడు.

ఓట్‌ ఫర్‌ మోడీ అని బీజేపీ ఎన్నికల గుర్తు కమళం గుర్తును కూడా కార్డుపై ముద్రించాడు. తనకు మోడీ అంటే ఎంతో అభిమానమని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారని ముఖేష్‌ రావు తెలిపారు. అంతేకాదు మోడీ స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్న ఆఫీసులో ప్రతి నెల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.

ముఖేష్‌ రావు టీఎస్‌ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Latest Updates