మహిళలపై దాడి చేసిన వారికి బెయిల్ ఇవ్వొద్దు: రోజా

వ్యవస్థల మీద మహిళలు నమ్మకం కోల్పోతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నిందితులకే హక్కులుంటాయా.. ఆడవారికి లేవా అని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రత అంశంపై చర్చలో రోజా మాట్లాడారు. మహిళలకూ హక్కులున్నాయని NHRC గుర్తించుకోవాలన్నారు. చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాలు NHRCకి కనిపించవన్నారు. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడిపోతున్నారని… దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటున్నారన్నారు. నిర్భయ కేసులో ఇప్పటికీ దోషులకు శిక్ష అమలు కాలేదని.. మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలన్నారు. మహిళలపై దాడి చేసిన వారికి బెయిల్ కూడా ఇవ్వవద్దన్నారు రోజా. మహిళలపై వేధింపుల కేసుల్లో త్వరగా న్యాయం జరగాలన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే వెన్నులో వణుకు పుట్టేలా చట్టం ఉండాలన్నారు ఎమ్మెల్యే రోజా.

Latest Updates