జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దు

సీబీఐ కేసుల్లో ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో  ఇవాళ(బుధవారం) జరిగింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వవద్దని కోర్టును కోరింది సీబీఐ. జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వకుండా విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని సీబీఐ తరఫు లాయర్ హైకోర్టుకు విన్నవించారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పై ఏప్రిల్ 9న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

Latest Updates