గుళ్లలో తీర్థ ప్రసాదాలు వద్దు

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్​ గుళ్లలో తీర్థ ప్రసాదాలపై పడింది. కొన్ని రోజుల పాటు వాటిని భక్తులకు ఇవ్వొద్దని కేంద్రం సూచించింది. పవిత్ర జలాన్నీ చల్లొద్దని చెప్పింది. ఆఫీసులు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్​లో ఏసీ టెంపరేచర్​ను 24 నుంచి 30 డిగ్రీలకే లిమిట్​ చేసింది. లాక్​డౌన్​లో మినహాయింపులు ఇస్తూ అన్ని యాక్టివిటీలకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ దానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం గైడ్​లైన్స్​ జారీ చేసింది.  అన్నింట్లోనూ ఫేస్​మాస్కులు, కనీసం ఆరడుగుల దూరం వంటి వాటిని తప్పనిసరి చేసింది. ఆరోగ్యసేతు యాప్​ను కంపల్సరీగా డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించింది.

ఆఫీసుల్లో ఇలా..

కరోనా లక్షణాలు లేని ఉద్యోగులు లేదా విజిటర్లను మాత్రమే లోపలికి పంపాలి. సోషల్​ డిస్టెన్స్​తో ఉద్యోగుల సీటింగ్​ను అరెంజ్​ చేయాలి.

ఎవరైనా అధికారి లేదా సిబ్బంది కంటెయిన్​మెంట్​ జోన్​లో నివసిస్తూ ఉంటే తప్పనిసరిగా సంబంధిత అధికారికి చెప్పాలి. కంటెయిన్​మెంట్​ జోన్​ తీసేసేంత వరకు ఆఫీసుకు రావొద్దు. ఇంటి నుంచే పనిచేయొచ్చు. దానిని లీవ్​ పీరియడ్​గా లెక్కిస్తారు.

డ్రైవర్లు సోషల్​ డిస్టెన్స్​ పాటించాలి. వాళ్లు నడిపే వాహనాలను సోడియం హైపోక్లోరైట్​తో శుభ్రం చేయాలి.

హైరిస్క్​ ఉన్న పెద్ద వయసు ఉద్యోగులు, గర్భిణులు, ఇతర జబ్బులున్నోళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాజమాన్యాలు వీలైనంత వరకు వాళ్లతో ఇంటి నుంచే పనిచేయించాలి.

మీటింగులన్నీ వీడియో కాన్ఫరెన్స్​లోనే జరగాలి.

ఆఫీసుకు దగ్గర్లోని షాపులు, కేఫెటేరియాల్లో సోషల్​ డిస్టెన్సింగ్​ ఉండాలి.

ఎవరికైనా పాజిటివ్​ వస్తే…

ఎవరికైనా పాజిటివ్​ వస్తే వెంటనే వాళ్లను ఐసోలేట్​ చేయాలి. వేరే రూంలో ఉంచాలి. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి లేదా జిల్లా లేదా రాష్ట్ర హెల్ప్​లైన్​కు ఫోన్​ చేయాలి.

సదరు ఉద్యోగి కాంటాక్ట్​ అయినోళ్లను ర్యాపిడ్​ రెస్పాన్స్​ టీం గుర్తించాలి.

ఒక ఆఫీసు లేదా గుడి లేదా హోటల్​ లేదా రెస్టారెంట్​లో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వస్తే వాటిని మూసేయాల్సిన అవసరం లేదు. ప్రొటోకాల్​ ప్రకారం క్లీన్​ చేసిన తర్వాత ఓపెన్​ చేయొచ్చు.

అంతకన్నా ఎక్కువ కేసులు వచ్చి ఉంటే ఆ బిల్డింగ్​ లేదా బ్లాక్​ను 48 గంటల పాటు మూసేయాలి. డిసిన్​ఫెక్ట్​ చేసేంత వరకు మూసే ఉంచాలి. ఆఫీసైతే ఇంటి నుంచే ఉద్యోగులు పనిచేయాలి.

రెస్టారెంట్లు.. మాల్స్​

రెస్టారెంట్లు వీలైనంత వరకు డైన్​ఇన్​ను అనుమతించకపోవడమే మంచిది. ఎక్కువగా టేక్​ అవే (పార్శిళ్లు)లకు ఇంపార్టెన్స్​ ఇవ్వాలి. ఫుడ్​ డెలివరీ సిబ్బంది ప్యాకెట్లను డోర్ల దగ్గర వదిలిపెట్టాలి.

కస్టమర్​ వెళ్లాక ఆ టేబుల్​ను తప్పనిసరిగా క్లీన్​ చేయాలి.

సోషల్​ డిస్టెన్స్​ రూల్స్​ను పాటించేలా తగినంత సిబ్బందిని నియమించాలి.

కస్టమర్లు 50% మించొద్దు.

ఎస్కలేటర్లపై మెట్టు విడిచి మెట్టుపై ఒకరు మాత్రమే ఉండేలా చూడాలి.

గేమింగ్​ ఆర్కేడ్​లు, పిల్లల ప్లే ఏరియాలు, మాల్స్​లోని సినిమా హాళ్లను మూసేయాలి.

పెద్ద హోటళ్లలో గెస్టులు దిగినప్పుడు వాళ్ల ట్రావెల్​ హిస్టరీ, మెడికల్​ కండిషన్​ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాళ్ల ఐడీతో పాటు సెల్ఫ్​ డిక్లరేషన్​ను తీసుకోవాలి.

కామన్​గా ఉండేవి

ఎంట్రెన్సుల్లో శానిటైజర్​ను పెట్టాలి. అందరికీ థర్మల్​ స్క్రీనింగ్​ చేయాలి.

ఏసీ టెంపరేచర్​ను 24 నుంచి 30 డిగ్రీల మధ్య పెట్టాలి. గాలిలో తేమ శాతం 40 నుంచి 70 దాకా ఉండేలా చూసుకోవాలి.

సోషల్​ డిస్టెన్స్​ క్యూ పాటించేలా మార్కింగ్స్​ చేయాలి.

లిఫ్టుల్లో వెళ్లే వారి సంఖ్యను తగ్గించాలి.

పార్కింగ్​కు సంబంధించి సోషల్​ డిస్టెన్సింగ్​ పాటించాలి. వీలైతే వాలెట్​ పార్కింగ్​ను వాడొచ్చు. వాలెట్​ పార్కింగ్​లో స్టీరింగ్​, డోర్​, హ్యాండిల్స్​, తాళాలను శానిటైజ్​ చేయాలి.

గుళ్లలో ఇలా

మాస్కులున్నోళ్లనే గుళ్లలోకి అనుమతించాలి.

దేవుడి విగ్రహాలు, పవిత్ర పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దు.

తీర్థ ప్రసాదాలను పూజారులు ఇవ్వకూడదు. పవిత్ర జలాన్ని భక్తుల మీద చల్లకూడదు. అన్నదాన సత్రాల్లో కనీస దూరం పాటించాలి.

ప్రార్థనలకు కామన్​ మ్యాట్​లను వాడొద్దు. ఎవరికివారు ఇంటి నుంచే తెచ్చుకోవాలి.

For More News..

తహసీల్దార్ల అధికారాల్లో కోత!

ఈ టైమ్‌లో ఎగ్జామ్స్‌ పెట్టాలనుకుంటున్నరా?

నోటిఫికేషన్ టైమ్‌ అయిపోయినా.. డిక్లరేషన్ ఎట్లిచ్చిన్రు?

Latest Updates