మైండ్ ట్రీని వదిలేది లేదు

  • ఓపెన్ ఆఫర్ తో ఎల్ అండ్ టీ రెడీ

ఐటీ సేవల సంస్థ మైండ్‌ ట్రీలో అదనంగా 31శాతం వాటా కొనడానికి లార్సన్‌‌ అండ్‌ టూబ్రో(ఎల్‌‌ అండ్‌ టీ) ఈ ఏడాది మే 14 నుంచి ఓపెన్‌‌ ఆఫర్‌‌ నిర్వహించనుంది. ఆఫర్‌‌ అదే నెల 27నముగుస్తుందని తన వాటాదారులకు తెలిపింది. ఒక్కోషేరుకు రూ.980 చొప్పున చెల్లిస్తా మని ప్రకటించింది. ఈ విషయమై మైండ్‌ ట్రీ ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్లు కంపెనీ షేర్లహో ల్డర్లకు తమ సిఫార్సులు తెలియజేయడానికి మే 10 వరకు గడువు ఉంటుంది.ఈ ఓపెన్‌‌ ఆఫర్‌‌ వల్ల రెం డు కంపెనీలకూ మేలు జరుగుతుందని ఎల్‌‌ అండ్‌ టీ పేర్కొంది. మైండ్‌ ట్రీ ప్రమోటర్లు, ఉద్యోగులు మాత్రం ఎల్‌‌ అండ్‌ టీ ఓపెన్‌‌ ఆఫర్‌‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది బలవంతపు స్వాధీనమని వాదిస్తున్నా రు. ‘‘ఎల్‌‌ అండ్‌ టీ చేతు ల్లో కి కంపెనీ వెళితే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి వెనక్కి వెళ్తుంది. తమ 20 ఏళ్ల కష్టం వృథా అవుతుంది. ఈ చర్య కార్పొరేట్‌‌ సం స్కృతికి మంచిది కాదు. క్లయిం ట్లతో సంబంధాలూ దెబ్బతింటాయి. ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉంటాయి. వాటా విక్రయం ప్రతిపాదనను మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం  అని ప్రమోటర్లు కృష్ణకుమార్‌‌ నటరాజన్‌‌, సుబ్రొతో బాగ్చీ, పార్థసారథి వాదించారు. ఎల్‌‌ అండ్‌ టీ మాత్రం ఈ వాదనను తిరస్కరించింది.‘కాఫీడే యజమాని వీజీ సిద్ధార్థ మూడు నెలల క్రితం మమ్మల్ని సంప్రదించడం వల్లే మైండ్‌ ట్రీ కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టాం .ఈ డీల్‌‌ను మోటర్లు వ్యతిరేకిస్తున్న మాట నిజమే! కొద్దికాలం తరువాత భావోద్వేగాలు చల్లారుతాయి. మేనేజ్‌‌మెంట్‌‌లో ని సీనియర్‌‌ అధికారులు మాకు వ్యక్తి గతంగా స్నేహితు లు. మైండ్‌ ట్రీ ఇప్పుడు ఈస్థాయిలో ఉండటానికి వాళ్లే కారణం. ఒప్పం దం సానుకూలంగా ముగుస్తుందని ఆశాభావంతో ఉన్నాం.ఇంతకుముందు కూడా మైండ్‌ ట్రీ యాజమాన్యం వాటా అమ్మకం కోసం మమ్మల్ని సంప్రదించినా, అప్పుడు మాకు వీలు కాలేదు’ అని కంపెనీ ఎండీ,సీఈఓ సుబ్రమణియన్‌‌ అన్నా రు. సిద్ధా ర్థకు ఈ కంపెనీలో ఉన్న మొత్తం 20.32 శాతం వాటాను రూ.3,269 కోట్లకు కొంది. ఓపెన్‌‌ ఆఫర్‌‌ ద్వారా మరో 31 శాతం వాటాను, ఓపెన్‌‌ మార్కెట్లో మరో 15 శాతం వాటాలను దక్కిం చుకుంటామని ఎల్‌‌ అండ్‌ టీ తెలిపింది. సంస్థలో మొత్తం 67 శాతం వాటాలను దక్కిం చుకోవడానికి రూ.10,800 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది.

Latest Updates