ఎన్నికల్లో.. ఒక్కరు ఓడినా చెడ్డపేరొస్తది: కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ ,మల్కాజ్ గిరి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని తమ పార్టీ జీహెచ్‌ ఎంసీ కార్పొరేటర్లకు టీఆర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ సూచించారు. ఒక్కరు ఓడినా పార్టీకి చెడ్డపేరు వస్తుందని, టీఆర్ ఎస్​ డౌన్​ట్రెండ్​ మొదలైందంటూ విమర్శలు మొదలవుతాయని హెచ్చరించారు. ప్రతిపక్షాలకు అలాం టి అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఎల్‌ బీ స్టేడి యంలో జరగాల్సిన సీఎం ప్రచార సభ రద్దు, దానిపై విమర్శల నేపథ్యంలో కేటీఆర్‌‌ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. సోమవారం తెలంగాణ భవన్​లో జీహెచ్​ఎంసీ మేయర్‌‌, కార్పొరేటర్లతో స మావేశమయ్యారు .దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఈ భేటీలో కేటీఆర్ పలు సూచనలు చేశారు. కార్పొరేటర్లు ఎమ్మెల్యే లతో సమన్వయం చేసుకుని ప్రచారంలో పాలు పంచుకోవాలని చెప్పారు . క్యాడర్‌‌ ప్రచారంలో పాల్గొనేలా కార్పొరేటర్లే చూసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.

ఒక్క సీటూ కోల్పోవద్దు….

మూడు ఎంపీ సీట్లలో ఒక్క సీటును కూడా కోల్పోవడానికి వీల్లే దని కేటీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.ఒక్కరు ఓడినా మొత్తం పార్టీకే చెడ్డపేరు వస్తుందన్నట్టుతెలిసింది. జీహెచ్​ఎంసీ ఎన్ని కల్లో 99 స్థానాల్లో టీఆర్ ఎస్​కార్పొరేటర్లు గెలిచారని,ఎంఐఎం కార్పొరేటర్లను మినహాయిస్తే .. కాం గ్రెస్‌ ,బీజేపీ, టీడీపీ గెలిచిన సీట్లెన్ని అని పేర్కొన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో తిరిగి 99 స్థానాల్లో గెలవకపోతే డౌన్‌ ట్రెండ్‌ మొదలైందంటూ ప్రచారం మొదలుపెడతారని.. కొన్ని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా అదే పనిగా టీఆర్‌‌ఎస్‌ పనైపోతుందంటూ భూతద్దం లో చూపిస్తాయని వ్యాఖ్యానిం చినట్టు తెలిసిం ది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం.

Latest Updates