స్పీకర్ నిర్ణయాలపై సభ బయట మాట్లాడొద్దు

స్పీకర్ నిర్ణయాలపై సభ బయట మాట్లాడొద్దు
లోక్​సభ మెంబర్లకు ఓం బిర్లా సూచన

న్యూఢిల్లీ:  తన​ నిర్ణయాలపై సభ బయట  మాట్లాడటం మంచి సంప్రదాయం కాదని లోక్​సభ స్పీకర్  ఓం బిర్లా మంగళవారం అన్నారు. ​ లోక్​సభలో సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగేందుకు తనకు అనుమతి ఇవ్వడంలేదని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​గాంధీ  ఆరోపించిన మరుసటి రోజే స్పీకర్​ దీనిపై రియాక్ట్​ అయ్యారు.  చేపల్ని కోల్డ్​ స్టోరేజ్​లో ఉంచడంపై  అడిగిన ప్రధాన ప్రశ్న కు  సభ్యులు చాలా సప్లిమెంటరీ ప్రశ్నల్ని అడిగారు.  మరో అంశాన్ని టేకప్​ చేయడానికి స్పీకర్​కు సుమారు 20 నిమిషాలు పట్టింది. కాంగ్రెస్​ సహా మరికొన్ని పార్టీల ఎంపీలు మంగళవారం సభలో ఎక్కువ సప్లిమెంటరీ క్వశ్చన్లు అడిగారు. దీనిపై ఓంబిర్లా రియాక్ట్​ అయ్యారు. “ ఒక ప్రశ్నకు 15-–20 నిమిషాలు పడుతుంది … ఆపై  మధ్యాహ్నం 12  గంటల  తర్వాత సప్లిమెంటరీ ప్రశ్నలు అనుమతించడం మంచిది కాదు ” అని బిర్లా సభ్యులకు వివరించారు.  ఈ సందర్భంలో స్పీకర్​ తీసుకునే నిర్ణయాలపై సభ బయట ప్రశ్నించడం  మంచి పద్ధతి కాదని సూచించారు.  క్వశ్చన్ అవర్​లో సభ్యులు అడిగే ప్రశ్నలు, మంత్రులు చెప్పే సమాధానాలు బ్రీఫ్​గా ఉండాలని స్పీకర్​ తరచూ సభలో చెబుతూనే ఉన్నారు.

కాంగ్రెస్​, డీఎంకే, ఎన్సీపీ ఎంపీల వాకౌట్

క్వశ్చన్‌‌ ​అవర్​లో సప్లిమెంటరీ ప్రశ్నల్ని అడిగేందుకు స్పీకర్​ నిరాకరించారంటూ మంగళవారం కాంగ్రెస్​ , డీఎంకె, ఎన్సీపీ ఎంపీలు లోక్​సభ నుంచి మంగళవారం వాకౌట్​ చేశారు. అధికార భాషకు సంబంధించిన ప్రశ్నపై హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్​ రాయ్​ సమాధానం చెబుతుండగా  కొంతమంది సభ్యులు నిరసనలు తెలిపారు.  వాటినిపట్టించుకోకుండా స్పీకర్​ ఓం బిర్లా తర్వాత ప్రశ్నను టేకప్​చేశారు.  సప్లిమెంటరీ క్వశ్చన్లు అడిగేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ డీఎంకే లీడర్​ టీఆర్​ బాలు నిరసన తెలిపారు. కాంగ్రెస్​ లీడర్​ రాహుల్ గాంధీ  ఆయనకు మద్దతు  తెలిపారు. స్పీకర్​ మరొక ప్రశ్నకు అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్​, డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వాకౌట్​చేశారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

Latest Updates